Advertisementt

అల్లుడి నటనపై చిరు ప్రశంసల జల్లు..!

Fri 13th Jul 2018 09:46 PM
chiranjeevi,son in law,kalyaan dhev,vijetha,praises  అల్లుడి నటనపై చిరు ప్రశంసల జల్లు..!
Chiranjeevi Praises Son in Law Kalyaan Dhev అల్లుడి నటనపై చిరు ప్రశంసల జల్లు..!
Advertisement
Ads by CJ

ఇంతకాలం మెగాఫ్యామిలీ నుంచి మెగామేనల్లుడుగా సాయిధరమ్‌తేజ్‌ నిలిచాడు. తాజాగా చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ కూడా 'విజేత' చిత్రం ద్వారా హీరోగా పరిచయం అయ్యాడు. ఈ చిత్రం విడుదలై మంచి టాక్‌ను తెచ్చుకుంది. ఇక ప్రసాద్‌ల్యాబ్స్‌లో చిరంజీవి, తన చిన్నల్లుడు-ఈ చిత్ర హీరో కళ్యాణ్‌దేవ్‌తో కలిసి 'విజేత' చిత్రాన్ని ప్రత్యక్షంగా చూశారు. ఈ సందర్బంగా మెగాస్టార్‌ మాట్లాడుతూ.. ఈ చిత్రాన్ని దర్శకుడు రాకేష్‌ శశి అద్భుతంగా తీశాడు. తొలి సినిమా అయినా కళ్యాణ్‌దేవ్‌ ఎలాంటి ఒత్తిడి లేకుండా నటించడం ఆనందంగా ఉంది అని అన్నారు. ఈ చిత్రం స్పెషల్‌ షోని చిరంజీవి, కళ్యాణ్‌దేవ్‌లతో పాటు అల్లుఅరవింద్‌, మురళీశర్మ ఇతర యూనిట్‌ కలిసి వీక్షించారు. 

కళ్యాణ్‌దేవ్‌ మాట్లాడుతూ.. నటనలో శిక్షణ తీసుకుని వచ్చిన వారంలోపే ఈ చిత్రంలో తనకి అవకాశం వచ్చిందని చెప్పాడు. 'విజేత' కథను మావయ్యకి చెప్పగా ఆయనకెంతో నచ్చిందని తెలిపాడు. ఇక ఈ చిత్రంలో కళ్యాణ్‌దేవ్‌ అంటే హీరో ఫాదర్‌ క్యారెక్టర్‌కి మురళీశర్మ అయితేనే పక్కాగా సరిపోతాడని చిరు సలహా ఇచ్చి మరీ మురళీశర్మని పెట్టించాడని వార్తలు వస్తున్నాయి. చిరు నమ్మకాన్ని నిలబెడుతూ మురళీశర్మ కూడా మంచి ప్రతిభను చూపించాడు. 

'భలే భలే మగాడివోయ్‌' తర్వాత మురళీశర్మకి చెప్పుకోదగ్గ చిత్రం 'విజేత'నే అవుతుందని చెప్పవచ్చు. సాయి కొర్రపాటి నిర్మించిన ఈ చిత్రంలో కళ్యాణ్‌దేవ్‌కి జంటగా మాళవికా నాయర్‌ నటించింది. ఇక 'విజేత' చిత్రంపై దర్శకధీరుడు రాజమౌళి కూడా ప్రశంసల వర్షం కురిపించాడు. ఈ చిత్రం విడుదలకు ముందే తన రివ్యూని ట్వీట్‌ ద్వారా తెలియజేశారు. చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరో కావడం, ఈ చిత్రాన్ని నిర్మించిన వారాహిచలన చిత్రం అధినేత సాయికొర్రపాటిలతో రాజమౌళికి ఉన్న సాన్నిహిత్యం కారణంగానే జక్కన్న ఈ ట్వీట్‌ చేశాడని అంటున్నారు. 

Chiranjeevi Praises Son in Law Kalyaan Dhev:

Mega Star Chiranjeevi Watches Son in law's Vijetha Movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ