మెగా హీరో సాయి ధరమ్ తేజ్ కి బాగా బ్యాడ్ టైం నడుస్తుంది. వరసబెట్టి అతని సినిమాలన్నీ ప్లాప్స్ అవడంతో.. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ దిక్కుతోచని పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు. ఎన్నో ఆశలు పెట్టుకున్న 'తేజ్ ఐ లవ్ యూ' సినిమా కూడా ప్లాప్ అవడంతో... సాయి ధరమ్ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారింది. 'జవాన్' ఓకే గా అనిపించినా.. 'ఇంటిలిజెంట్' ఘోరమైన ప్లాప్ అవడం, అలాగే కరుణాకరన్ డైరెక్షన్ లో ప్రేమ కథగా 'తేజ్ ఐ లవ్ యూ' చేసినా వర్కౌట్ అవ్వలేదంటే తేజ్ కున్న క్రేజ్ రోజురోజుకి పడిపోతుందనేది అర్ధమవుతుంది. మరి ఇలాంటి క్లిష్ట సమయంలో సాయి ధరమ్ తేజ్ ఎలాంటి సినిమా కథ వింటాడు, ఏ డైరెక్టర్ తో సినిమా చెయ్యబోతున్నాడో అనే ఆసక్తి అందరిలో కలుగుతుంది.
ఎందుకంటే ఈసారైనా మంచి హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కాలని సాయి కోరుకుంటున్నాడు కాబట్టి. అయితే సాయి ధరమ్ తేజ్ ఇప్పుడు ఒక కొత్త దర్శకుడికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా తెలుస్తుంది. గోపాల్ అనే కొత్త దర్శకుడు సాయి ధరమ్ తేజ్ కి ఒక స్టోరీ లైన్ వినిపించగా... ఆ లైన్ నచ్చి కథని డెవెలెప్ చెయ్యమని అతనితో తేజ్ చెప్పినట్లుగా తెలుస్తుంది. అయితే ఆ స్టోరీ లైన్ కి సాయి ధరమ్ బాగా కనెక్ట్ అయ్యాడని చెబుతున్నారు. ఇక గోపాల్ చెప్పిన కథకి 'భగవద్గీత సాక్షిగా' అనే టైటిల్ ను ఖరారు చేసినట్టుగా కూడా ప్రచారం జరుగుతుంది. మరి సాయి ధరమ్ తేజ్ 'భగవద్గీత సాక్షిగా' ఏం చేస్తాడో అనేది చెప్పడం కష్టమే.
ఎందుకంటే మనోడు ఈసినిమాలో ఏదో నేరంలో ఇరుక్కుని.. జైలు కెళితే తప్ప ఇలా 'భగవద్గీత సాక్షిగా' అనే డైలాగ్ వాడే సందర్భం రాదు. మరి సాయి ధరమ్ తేజ్ కి ఈ కథలో ఏం నచ్చిందో అనేది ఈ సినిమా పట్టాలెక్కేటప్పుడు గాని క్లారిటీ రాదు. మరి ఇప్పటికైనా సాయి ధరమ్ తేజ్ కథలు వినేటప్పుడు కాస్త కాన్సంట్రేట్ చేస్తే... ప్లాప్ ల నుండి తప్పించుకునే ఛాన్స్ ఉంటుంది. లేదంటే సదామాములే. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ - గోపాల్ కాంబోలో తెరకెక్కబోయే ఈ సినిమాని ఠాగూర్ మధు నిర్మించబోతున్నట్టుగా ఫిలింనగర్ టాక్.