Advertisementt

శ్రీరెడ్డి 'అరవ' ఎపిసోడ్‌ స్టార్ట్ చేసింది..!

Fri 13th Jul 2018 12:34 PM
sri reddy,kollywood,director,murugadoss  శ్రీరెడ్డి 'అరవ' ఎపిసోడ్‌ స్టార్ట్ చేసింది..!
Sri Reddy Targets Kollywood శ్రీరెడ్డి 'అరవ' ఎపిసోడ్‌ స్టార్ట్ చేసింది..!
Advertisement
Ads by CJ

టాలీవుడ్‌లో తాను లైంగికంగా మోసపోయానని, తనని లైంగికంగా వాడుకుని చాన్స్‌లు ఇస్తామని చెప్పిన అందరు మోసం చేశారని టాలీవుడ్‌పై నటి శ్రీరెడ్డి కాస్టింగ్‌కౌచ్‌కి సంబంధించిన పలు సంచలన ఆరోపణలు చేసి, అర్ధనగ్నంగా మా అసోసియేషన్‌ వద్ద ధర్నా చేసింది. ఇక ఈమె ఈమధ్య కాస్త మౌనం వహించిందనే పలువురు భావించారు. కానీ ఈ సారి ఆమె కోలీవుడ్‌పై పడింది. తన నెక్ట్స్‌ టార్గెట్‌ కోలీవుడేనని, తమిళ ఇండస్ట్రీ గుట్టు రట్టు చేసే సమయం వచ్చిందని తెలిపింది. 

ప్రముఖ తమిళ దర్శకుడు మురుగదాస్‌పై సంచలన వ్యాఖ్యలు చేసింది. తనకు అవకాశం ఇస్తానని చెప్పి మురుగదాస్‌ తనని మోసం చేశాడని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఆమె చేసిన పోస్ట్‌ ఇప్పుడు వైరల్‌ అవుతోంది. ఈ పోస్ట్‌లో ఈమె మాట్లాడుతూ, 'డియర్‌ మురుగదాస్‌ జీ.. ఎలా ఉన్నారు? మీకు గ్రీన్‌పార్క్‌ హోటల్‌ గుర్తుందా? వెలిగొండ శ్రీనివాస్‌ మీకు గుర్తున్నాడా? ఆయన ద్వారా మనం కలిశాం. ఆ తర్వాత మనం చాలా చేశాం. మీ సినిమాలో నాకు చాన్స్‌ ఇస్తానని ప్రామిస్‌ చేశారు. కానీ ఇంతవరకు మీరు నాకు ఒక్క చాన్స్‌ కూడా ఇవ్వలేదు. మీరు కూడా గొప్పవారే సార్‌' అని ట్వీట్‌ చేసింది. 

మొత్తానికి శ్రీరెడ్డి మురుగదాస్‌పై చేసిన వ్యాఖ్యలతో మరోసారి కలకలం రేగింది. త్వరలో శ్రీరెడ్డి మరికొందరు కోలీవుడ్‌ ప్రముఖుల పేర్లు బయట పెట్టడానికి సిద్దం అవుతోందని వార్తలు వస్తున్నాయి. మరి ఆమె ఈ సారి ఎవరిని టార్గెట్‌ చేస్తుందో వేచిచూడాల్సివుంది..! 

Sri Reddy Targets Kollywood:

Sri Reddy Sensational comments on Kollywood Director

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ