Advertisementt

ఆడవాళ్లు ఆ పని చేయడమేంటి?: కమల్ హాసన్!

Fri 13th Jul 2018 11:10 AM
gayathri raghuram,kamal hassan,bigg boss tamil,social media  ఆడవాళ్లు ఆ పని చేయడమేంటి?: కమల్ హాసన్!
Gayathri Raghuram React On Kamal hassan Comments ఆడవాళ్లు ఆ పని చేయడమేంటి?: కమల్ హాసన్!
Advertisement
Ads by CJ

వినేవారుంటే చెప్పేవారు ఏమైనా చెబుతారు. ఇక తనకు కులం, మతం వంటివి పడవని, తాను పక్కా వామపక్ష విప్లవభావాలున్న వ్యక్తినని కమల్‌ తరచుగా చెప్పేమాట. తాను ప్రపంచంలోని ప్రతి జీవి మాంసాన్ని తిన్నానని, తాను బ్రాహ్మణుడిని అయినా మాంసాహారిని అని, తనకు జంధ్యం ఇబ్బందిగా మారితే దానిని తీసివేశానని గతంలో చెప్పాడు. ఇక తన కూతుర్లను స్కూళ్లలో చేర్పించేటప్పుడు కూడా నేను నా కూతుర్ల మతం, కులం గురించి తాను పాఠశాల రికార్డుల్లో తెలపడానికి నిరాకరించానని అంటూ రామాయణం, భగవద్గీత, మహాభారతంలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తాడు. ఇక తన కూతుర్లకి కూడా స్వేచ్చ ఇష్టమని, తనకు కుమారుడు ఎంతో కుమార్తెలు కూడా అంతేనని, కాబట్టి తన కూతుర్లు శృతిహాసన్‌, అక్షరహాసన్‌లను వారి దారిలో వారిని స్వేచ్చగా జీవించాలని హితోపదేశం చేశాను.. అని చెబుతాడు. 

ఇక తండ్రిలాగానే ఆయన కూతుర్లు ఇద్దరు కూడా పూర్తి మంసాహార ప్రియులే కాకుండా సహజీవనం నుంచి మద్యంతో పాటు అన్ని అలవాట్లు ఉన్నాయని ఒప్పుకుంటారు. ఇలా చూడటానికి కమల్‌ అభ్యుదయ వాదిగా కనిపిస్తాడు. తనకు వివాహ వ్యవస్థపై నమ్మకం లేదని చెప్పి వాణి గణపతి, సారిక, గౌతమి, సిమ్రాన్‌, శ్రీవిద్య వంటి వారిని ఎందరినో నట్టేట ముంచాడు. ఇక విషయానికి వస్తే ఈయన తమిళ బిగ్‌బాస్‌ సీజన్‌1కే కాదు...సీజన్‌2కి కూడా హోస్ట్‌గా చేస్తున్నాడు. తాజాగా ఈయన మాట్లాడుతూ, బిగ్‌బాస్‌ షోలోని మహిళా కంటెస్టెంట్స్‌ విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారని, వారు పురుషులతో ఒకే మంచం మీద పడుకుంటూ, మగవారితో కలిసి సిగరెట్లు తాగుతున్నారని విమర్శించాడు. ఆయన మాట్లాడుతూ, ఆడవారు సిగరెట్‌ తాగడం ఏమిటి? మగవారు చేసే పనులను ఆడవారు చేయకూడదు. సంస్కృతి సంప్రదాయాలను గౌరవించాలని కమల్‌ అన్నాడు. 

దీనిపై సోషల్‌ మీడియాలో నటి గాయత్రి రఘురాం తీవ్రంగా స్పందించింది. మగవారి కంటే తాము ఎక్కువ అని చెప్పుకోవడానికి మహిళలు సిగరెట్లు తాగడం లేదు. ఆడవాళ్లకు కూడా మానసిక ఒత్తిడి, మనో వేధన ఉంటాయి. ఆ కారణంగానే వారు సిగరెట్లు కాలుస్తున్నారు. ధూమపానం అలవాటు మగవాళ్లకే కాదు ఆడవారికి కూడా చెడే. మగవారు గొప్పవారని, స్త్రీలు తక్కువ అని అర్ధం వచ్చేలా కమల్‌ మాటలు ఉన్నాయి. ఇక గత ఏడాది బిగ్‌బాస్‌1లో గాయత్రి రఘురాం పార్టిసిపెంట్‌గా వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీనిని బట్టే కమల్‌ చేతలకు, మాటలకు పొంతన ఉండదని ఖచ్చితంగా అర్దమవుతోంది. 

Gayathri Raghuram React On Kamal hassan Comments:

Gayathri Raghuram condemned the recent comments made by senior actor Kamal Haasan in Bigg Boss show Tamil version.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ