Advertisementt

ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చేసేది మ‌ల్టీస్టార‌రే!!

Thu 12th Jul 2018 11:18 PM
indraganti mohana krishna,multistarrer,dil raju,svc banner  ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చేసేది మ‌ల్టీస్టార‌రే!!
Indraganti Mohan Krishna Next Film Confirmed ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ చేసేది మ‌ల్టీస్టార‌రే!!
Advertisement
Ads by CJ

శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై దిల్‌రాజు నిర్మాణంలో ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్‌

తెలుగు ఇండ‌స్ట్రీలో మ‌ల్టీస్టార‌ర్ చిత్రాలు క‌నుమ‌రుగైన సంద‌ర్భంలో 'సీత‌మ్మ వాకిట్లో సిరిమ‌ల్లెచెట్టు' వంటి ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌ను వెంకటేశ్‌, మ‌హేశ్ వంటి స్టార్ హీరోల‌తో తెర‌కెక్కించిన మల్టీస్టార‌ర్ చిత్రాల‌కు నాంది ప‌లికిన నిర్మాత దిల్‌రాజు... నిర్మాణ సంస్థ శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్‌. అక్క‌డి నుండి మ‌ల్టీస్టార‌ర్ చిత్రాల సంఖ్య పెరుగుతూ వ‌స్తున్నాయి. ఈ ఏడాది దిల్‌రాజు ఇప్ప‌టికే వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌ల‌తో 'ఎఫ్ 2'(ఫ‌న్ అండ్ ఫ్ర‌స్టేష‌న్‌) అనే మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. 

ఇది కాకుండా మ‌రో మ‌ల్టీస్టార‌ర్‌కు శ్రీ వెంక‌టేశ్వ‌ర క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై శ్రీకారం చుడుతున్నారు స్టార్ నిర్మాత దిల్‌రాజు. 'అష్టాచ‌మ్మా, గోల్కొండ హైస్కూల్‌, అమీ తుమీ, జెంటిల్‌మన్‌, స‌మ్మోహ‌నం' వంటి డిఫ‌రెంట్‌,  సెన్సిబుల్ చిత్రాల‌ను తెర‌కెక్కించిన డైరెక్ట‌ర్ ఇంద్ర‌గంటి మోహ‌న‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో మ‌ల్టీస్టార‌ర్ తెర‌కెక్క‌నుంది. ఏక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కనున్నఈ చిత్ర పూర్తి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే చిత్ర‌యూనిట్ తెలియ‌జేయనుంది.

Indraganti Mohan Krishna Next Film Confirmed :

Director Indraganti Mohana Krishna’s next is a multistarrer under Dil Raju’s SVC banner

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ