Advertisementt

ఆ హీరోయిన్ ఎందుకు.. మిథాలీనే చేయొచ్చుగా!!

Thu 12th Jul 2018 08:10 PM
mithali raj,priyanka chopra,great choice,biopic  ఆ హీరోయిన్ ఎందుకు.. మిథాలీనే చేయొచ్చుగా!!
Mithali Raj says Priyanka Chopra ideal choice for her biopic ఆ హీరోయిన్ ఎందుకు.. మిథాలీనే చేయొచ్చుగా!!
Advertisement
Ads by CJ

మిథాలీరాజ్‌.. ఈమె పేరు క్రికెట్‌ అభిమానులకు సుపరిచితమైన పేరు, ఇండియన్‌ మహిళా క్రికెట్‌ కెప్టెన్‌గా ఆమె చిరస్మరణీయమైన విజయాలను భారత్‌కి అందించింది. ఇక ఈమె గ్లామర్‌షో ద్వారా కేవలం క్రికెట్‌ అభిమానులనే కాదు.. పలు సందర్బాలలో హీరోయిన్లకు మించిన గ్లామర్‌షో, అందంతో అందరినీ ఆకట్టుకుని మంచి క్రేజ్‌ తెచ్చుకుంది. భారతీయ మహిళా క్రీడాకారుల్లో సానియా మిర్జా తర్వాత అందం ఆరబోతలో మిథాలీరాజ్‌ పేరే వినిపిస్తుంది. 

కాగా ప్రస్తుతం ఆమె జీవితంపై ఓ బయోపిక్‌ రూపొందనుంది. ఇక ఇందులో కంగనారౌనత్‌ లేదా ప్రియాంకా చోప్రాలు నటిస్తారనే ప్రచారం బాగా జరుగుతోంది. ఇక ఈమె ప్రపంచవ్యాప్తంగా క్రీడాభిమానులందరికీ తెలిసిన వ్యక్తి కావడంలో హాలీవుడ్‌లో కూడా సత్తా చాటుతున్న ప్రియాంకాచోప్రానే అయితే ఈ చిత్రానికి ప్రపంచవ్యాప్తంగా క్రేజ్‌ వస్తుందనే చర్చలు కూడా సాగుతున్నాయి. ఇక తన బయోపిక్‌లో ఎవరు తన పాత్రలో నటిస్తే బాగుంటుంది? అనే విషయంపై తాజాగా మిధాలీరాజ్‌ స్పందించింది. 

నా వరకు మాత్రం నా పాత్రను ప్రియాంకా చోప్రా చేస్తేనే బాగుంటుందని నమ్మకం. ప్రియాంకా అయితేనే నా పాత్రలో చక్కగా నటించగలదు. మా ఇద్దరి వ్యక్తిత్వాలు దాదాపు ఒకే విధంగా ఉంటాయి. సినీ రంగంపై నాకు అంతగా అవగాహనలేదు. నటీనటుల ఎంపికను నిర్మాణ సంస్థకు వదిలేస్తున్నాను. అందులో నా జోక్యం ఏమీ ఉండదని ఆమె చెప్పుకొచ్చింది. అయినా మిథాలీ అందాలు, ఆమె గ్లామర్‌షో తెలిసిన వారు మాత్రం ఈ చిత్రంలో తన పాత్రను మిథాలీరాజే చేయవచ్చు కదా.. అంటున్నారు. అది కూడా నిజమేమరి ...! 

Mithali Raj says Priyanka Chopra ideal choice for her biopic:

Mithali Raj Feels Priyanka Chopra Will be a Great Choice For Her Biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ