సినిమాలో తను తీసే సీన్ బాగా రావడం కోసం ప్రొడ్యూసర్ తో ఎంతైనా ఖర్చు పెట్టిస్తాడు డైరెక్టర్ బోయపాటి శ్రీను. ఆయన గత సినిమాలు చూస్కుంటే మనకే అర్ధం అవుతుంది. ప్రస్తుతం ఇతను రామ్ చరణ్ హీరోగా ఒక సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. టాలీవుడ్ లో బడా నిర్మాతల్లో ఒకరైన డివివి దానయ్య దీనికి నిర్మాత.
రామ్ చరణ్ కు 100 కోట్లు మార్కెట్ ఉంది. అది కాకా చరణ్ లాస్ట్ మూవీ 'రంగస్థలం' సూపర్ హిట్ కావడంతో.. బోయపాటి తన సినిమాపై ఏం కాంప్రమైజ్ కాకుండా భారీగా ఖర్చు చేస్తున్నాడట. సినిమాలో ఓపెనింగ్ షాట్ కోసం చాలా ఖర్చు చేసాడని టాక్. అది విలన్ ఎంట్రీ సీన్ అయిన బహిరంగ సభ కోసం కోట్లు ఖర్చు చేయించారని టాక్.
ఇప్పుడు సినిమా దాదాపు 70 శాతం పూర్తయ్యాక బడ్జెట్ కంట్రోల్ చేయాలనుకుంటున్నారు. హీరో రామ్ చరణ్ బడ్జెట్ పై ఫుల్ కంట్రోల్ తీసుకుంటున్నట్టు టాక్. అనుకున్న దానికంటే 10 కోట్లు తక్కువే అవ్వాలని చరణ్ బోయపాటి కి క్లియర్ గా చెప్పాడంట. నిర్మాతకు లాభాలు మిగలాలని, మార్కెట్ వుంది కదా అని ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయించవద్దని చరణ్ చెప్పినట్లు తెలుస్తోంది. రామ్ చరణ్ చెప్పడమే కాదు అనుకున్న దాని కంటే 10 కోట్ల లోపు బడ్జెట్ తోనే ఫినిష్ చేస్తున్నట్లుగా ఇండస్ట్రీలో టాక్. ఎంతైనా రామ్ చరణ్ కూడా ఒక ప్రొడ్యూసరే కదా. ఆ ప్రొడ్యూసర్ బాధలు తనకు కూడా తెలుసు కాబట్టి అలా కంట్రోల్ చేస్తున్నాడు అని తెలుస్తుంది.