టాలీవుడ్ లో రవితేజ - ఇలియానా ల జంట ఏం హిట్ ఫెయిర్ కాదు. ఎందుకంటే ఇద్దరు కలిసి నటించిన మూడు సినిమాల్లో రెండు డిజాస్టర్స్ అయితే... ఒకటి సూపర్ హిట్ అయిన సినిమా. తాజాగా రవితేజ - ఇలియానాల జంట అమర్ అక్బర్ ఆంటోని సినిమాలో జంటగా నటిస్తున్నారు. ఇక అటు రవితేజ కూడా ఏమంత ఫామ్ లో లేడు. వరసగా రెండు సినిమాలు ప్లాప్ అవడంతో... ఇప్పుడు రవితేజ అట్టర్ ప్లాప్ డైరెక్టర్ శ్రీను వైట్ల దర్శకత్వంలో నటిస్తున్నాడు. మరోపక్క ఇలియానా క్రేజ్ టాలీవుడ్ లో ప్రస్తుతానికైతే లేదు. ఎందుకంటే అమ్మడు బాలీవుడ్ మీదున్న ఇష్టంలో టాలీవుడ్ ని బాగానే నెగ్లెట్ చేసింది. అయితే అక్కడ అవకాశాలు లేక అమ్మడు మళ్ళీ గోడక్కొట్టిన బంతిలా టాలీవుడ్ కి వచ్చి చేరింది. మరి ఇలా ముగ్గురు ప్లాప్ లో ఉన్నప్పుడు ఆ ముగ్గురి కాంబోలో తెరకెక్కుతున్న సినిమా మీద ఎలాంటి క్రేజ్ ఉంటుంది అనేదానికి సమాధానం వేరే చెప్పక్కర్లేదు.
మరి గతంలో ఇలియానా మొదటిసారి ఖతర్నాక్ సినిమాలో రవితేజ కి జోడిగా నటించింది. కానీ ఆ సినిమా భారీ డిజాస్టర్. ఆ సినిమాలో నక్షత్రగా ఇలియానా గ్లామర్ కూడా ఈ సినిమాని కాపాడలేకపోయింది. అలాగే ఇలియానా టాలీవుడ్ కి బై బై చెప్పేద్దామనుకున్న టైం లో పూరి జగన్నాధ్ మీదున్న గౌరవంతో రవితేజ సరసన దేవుడు చేసిన మనుషులు సినిమాలో టాక్సీ డ్రైవర్ గా నటించింది. ఇక ఈ సినిమా కూడా ఘోరమైన ప్లాప్ అయ్యింది. కానీ ఖతర్నాక్ కి దేవుడు చేసిన మనుషులకి మధ్యన వీరి కాంబోలో సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన కిక్ సినిమా భారీ హిట్. ఆ సినిమాతో రవితేజ స్టార్ హీరో అయ్యాడు. ఈ సినిమాలో రవితేజ రకరకాల పాత్రలతో అదరగొట్టగా.. ఇలియానా కూడా ప్రాధాన్యమున్న పాత్రలో నటించి మెప్పించింది.
ఇక వారు నటించిన మూడు సినిమాల్లో ఒకటి సూపర్ హిట్ కాగా.. రెండు డిజాస్టర్స్. ఇక నాలుగో సినిమా వీళ్ళకి సెకండ్ హిట్ ఇస్తుందో లేదంటే హ్యాట్రిక్ ప్లాప్ ఇస్తుందో అనేది మాత్రం కాస్త సస్పెన్స్. మరి శ్రీను వైట్ల దర్శకత్వంలో థమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో రవితేజ కంపల్సరీ హిట్ కొట్టాలి. మళ్ళీ టాలీవుడ్ లో నిలదొక్కుకొని టాప్ హీరోయిన్స్ కి పోటీ ఇవ్వాలంటే ఇలియానాకి ఈ సినిమా హిట్ అవసరం. మరోపక్క శ్రీను వైట్ల కి కూడా ఈ సినిమా హిట్ ఏంటో అవసరం. చూద్దాం రవితేజ - ఇలియానా - శ్రీను వైట్ల కి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో అనేది.