Advertisementt

దివ్యభారతి డూప్‌ సల్మాన్‌ని కలిసింది!

Thu 12th Jul 2018 01:55 PM
salman khan,rambha,dabangg tour,2018,judwaa  దివ్యభారతి డూప్‌ సల్మాన్‌ని కలిసింది!
Rambha with Family meets Salman Khan at Toronto దివ్యభారతి డూప్‌ సల్మాన్‌ని కలిసింది!
Advertisement
Ads by CJ

తెలుగులో ఒకనాడు దివ్యభారతి సృష్టించిన సంచలనం అంతా ఇంతాకాదు. కేవలం 16 ఏళ్ల వయసులోనే ఈమె వెంకటేష్‌తో 'బొబ్బిలిరాజా', చిరంజీవితో 'రౌడీ అల్లుడు', బాలకృష్ణతో 'ధర్మక్షేత్రం', మోహన్‌బాబుతో 'అసెంబ్లీరౌడీ' వంటి చిత్రాలలో నటించింది. కానీ ఆమె చిన్నవయసులోనే అనుమానాస్పదంగా మరణించడంతో అప్పటికే తమిళ హీరో ప్రశాంత్‌, దివ్యభారతి జంటగా నటిస్తున్న హిందీ 'దిల్‌' రీమేక్‌ 'తొలిముద్దు' చిత్రం ఇబ్బందులో పడింది. ఆ సమయంలో అచ్చు దివ్యభారతిలానే ఉండి రాజేంద్రప్రసాద్‌, ఈవీవీ సత్యనారాయణ కాంబినేషన్‌లో వచ్చిన 'ఆ.. ఒక్కటి అడక్కు' చిత్రం ద్వారా పరిచయమైన రంభను డూప్‌గా పెట్టి దివ్యభారతి క్యారెక్టర్‌ షూటింగ్‌ను పూర్తి చేశారు. 

ఇక రంభ తెలుగులో చిరంజీవితో 'బావగారూ బాగున్నారా, హిట్లర్‌, అల్లుడా మజాకా.. బాలకృష్ణతో 'భైరవద్వీపం', జెడిచక్రవర్తితో 'బొంబాయి ప్రియుడు', ముద్దుల ప్రియుడు, అల్లరి ప్రేమికుడు.. ఇలా ఎన్నో చిత్రాలలో నటించి స్టార్‌ హీరోయిన్‌ అయింది. ఆమె ప్రస్తుతం వివాహం చేసుకుని తన భర్త, పిల్లలతో అమెరికాలో ఉంటోంది. ఇక ఈమె బాలీవుడ్‌లో కూడా సల్మాన్‌ఖాన్‌తో కలిసి 'హలోబ్రదర్‌' రీమేక్‌ 'జుడ్వా'లో నటించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించింది. ఇంకా ఆమె తమిళం, మలయాళం, కన్నడ, భోజ్‌పురి, బెంగాళీ భాషా చిత్రాలలో కూడా నటించింది. 

ఇక ప్రస్తుతం సల్మాన్‌ ఖాన్‌ దబాంగ్‌ టూర్‌లో భాగంగా అమెరికాలో ఉన్నాడు. అక్కడ తాజాగా రంభ, తన భర్త, పిల్లలతో కలిసి సల్మాన్‌ ని కలిసింది. ఈ సందర్భంగా ఆమె దబాంగ్‌ టూర్‌లో ఉన్న సల్మాన్‌, కత్రినాకైఫ్‌, ప్రభుదేవా, సోనాక్షిసిన్హా, జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ తదితరులతో ఫొటో దిగి తన సోషల్‌మీడియా ఖాతాలో పోస్ట్‌ చేసింది. తనతో జుడ్వాలో కలిసి నటించిన సల్మాన్‌ తదితరులు ఎంతో ఆనందంగా గడిపారని ఆమె చెప్పుకొచ్చింది. కాగా ఈమె నటించిన చివరి తెలుగు చిత్రాలు 'దేశముదురు, యమదొంగ' కావడం విశేషం.

Rambha with Family meets Salman Khan at Toronto:

Salman Khan meets Rambha during Dabangg Tour 2018, gives major Judwaa throwback

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ