జనసేన అధినేత పవన్‌కళ్యాణ్ తాజాగా అభిమానుల ఆత్మీయసదస్సులో ఉద్వేగ భరితమైన ప్రసంగం చేశారు. ఈ క్రమంలో భాగంగా ఆయన తన అన్నయ్య మెగాస్టార్ చిరంజీవిని పొగుడుతూ ప్రసంగిస్తూ ఉంటే ఓ మెగా వీరాభిమాని నానా రచ్చచేశాడు. అభిమానం తట్టుకోలేక ఆ అభిమాని చేస్తున్న చేష్టలను చూసిన పవన్ 'కూర్చోమని' ఆ అభిమానిని ఆదేశించాడు. 'కూర్చో.. కూర్చో' అని పవన్ ఎంత నింపాదిగా చెప్పినా ఆ వీరాభిమాని పట్టించుకోకపోవడంతో పవన్ కూర్చో.. అతి చేయకు.. అంటూ ఆగ్రహం వెలిబుచ్చాడు. ఈ సందర్భంగా ఆయన సినీ కెరీర్‌కి సంబంధించిన ఓ విషయాన్ని కూడా ప్రస్తావించారు.
నేను 'సుస్వాగతం' చిత్రంలో నటిస్తున్న రోజులవి. నేను బస్సులోకి ఎక్కి బస్సులోని అందరి ముందు డ్యాన్స్ చేయాలి. కానీ నాకు బాగా సిగ్గేసింది. చేయలేకపోయాను. ఆ సమయంలో వదినకు ఫోన్ చేసి 'వదినా...నేను ఈ సినిమాలకు సూట్ కాను. నేను చేయలేను. నేను ఆత్మహత్య చేసుకుంటా'నని చెప్పానంటూ తన అనుభవాలను ఆయన అభిమానులతో పంచుకున్నారు. నా ప్రవృత్తి సినిమాలు అయి ఉండవచ్చు. కానీ నా వృత్తి మాత్రం ప్రజాసేవే. ఎన్జీవో సంస్థ కంటే రాజకీయాలలోకి వస్తే ప్రజలకు ఎక్కువ సేవ చేయవచ్చని రాజకీయాలలోకి వచ్చి 'జనసేన' పార్టీని స్థాపించాను. ప్రజాసేవకే నా జీవితం అంకితం. అలాగే ఇక అన్నయ్య జీవితం సినిమాలకే అంకితమని తేల్చిచెప్పాడు.
దీంతో పవన్ ఇక సినిమాల జోలికి వెళ్లకపోవచ్చని వినిపిస్తూ ఉంటే,. మరలా ఏపీలో కాంగ్రెస్‌ని బలోపేతం చేయడానికి ఏఐసీసీ అధ్యక్షుడు, కాంగ్రెస్ ప్రధాని అభ్యర్థి రాజీవ్‌గాంధీ నడుం కట్టారు. అందులో భాగంగానే ఆయన కేరళ మాజీ సీఎం ఉమెన్‌చాందికి ఏపీ బాధ్యతలు అప్పగించి, ఏపీకి కాంగ్రెస్ కంటే బిజేపీనే ఎక్కువ మోసం చేసిందని ప్రచారం చేస్తూ కరడుగట్టిన సమైక్యవాది అయిన మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్‌కుమార్‌రెడ్డి, ఉండవల్లి, సబ్బంహరి, లగడపాటి రాజగోపాల్ వంటి వారిని ఘర్ వాపసీ కింద చేరదీస్తున్న సమయంలో చిరు ఏపీ కాంగ్రెస్‌లో కింగ్ పాత్ర పోషిస్తాడని వార్తలు వస్తున్న వేళ పవన్ తన అన్నయ్య జీవితం మాత్రం ఇక సినిమాలకే అంకితమని ప్రకటించడం ఆసక్తికర అంశంగా చెప్పుకోవాలి.