Advertisementt

ఓన్లీ కాజల్ కి సపోర్ట్ కే ఆ హీరో..!!

Wed 11th Jul 2018 07:19 PM
director teja,kajal agarwal,lead role,bellamkonda srinivas film  ఓన్లీ కాజల్ కి సపోర్ట్ కే ఆ హీరో..!!
Kajal Agrawal to play a lead in director Teja's upcoming film ఓన్లీ కాజల్ కి సపోర్ట్ కే ఆ హీరో..!!
Advertisement
Ads by CJ

తెలుగులో స్టార్ హీరోస్ తో ఎన్నో సినిమాలు చేసిన కాజల్.. తెలుగు ప్రేక్షకుల్లో మంచి మార్కులే కొట్టేసింది. గ్లామర్ పరంగా.. నటన పరంగా మంచి పేరు సంపాదించుకున్న ఈ బ్యూటీ లేటెస్ట్ గా తేజ దర్శకత్వంలో తెరకెక్కబోయే చిత్రంలో బెల్లంకొండ శ్రీనివాస్ సరసన నటిస్తుంది. అయితే ఈమె శ్రీనివాస్ కి జోడిగా నటిస్తుందనుకున్నారు అంతా.

తాజాగా ఫిలింనగర్ సర్కిల్స్ నుండి అందుతున్న సమాచారం ప్రకారం... ఇది కథానాయిక ప్రాధాన్యత కలిగిన కథ అంట. కథ మొత్తం హీరోయిన్ కాజల్ చుట్టూనే తిరుగుతుందంట. ఆమెను సపోర్ట్ చేసే పాత్రలో బెల్లంకొండ శ్రీనివాస్ నటిస్తున్నాడని, లేడీ ఓరియెంటెడ్ మూవీ కాబట్టే ఈ సినిమాకు 'నాయిక' అనే టైటిల్ అనుకుంటున్నారట మేకర్స్.

ఇందులో కాజల్ పాత్ర చాలా పవర్ ఫుల్ గా ఉండబోతుందని చిత్ర యూనిట్ కూడా చెబుతున్నారు. 'నేను రాజు నేనే మంత్రి' సినిమాలో కాజల్ పాత్ర ఎంత బాగుంటుందో.. అంతకు మించి ఈ సినిమాలో కాజల్ పాత్ర బాగుంటుందని ఇన్సైడ్ టాక్. మరి ఇది లేడీ ఓరియెంటెడ్ మూవీ అయ్యినప్పుడు శ్రీనివాస్ ఈ సినిమాను ఎలా ఒప్పుకున్నాడో అర్ధం కానీ విషయం.

Kajal Agrawal to play a lead in director Teja's upcoming film:

Teja, Kajal and Bellamkonda Srinivas Film Started

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ