Advertisementt

‘2.ఓ’ రిలీజ్ డేట్- శంకర్‌కి ప్రామిస్ చేశారంట!

Wed 11th Jul 2018 04:48 PM
  ‘2.ఓ’ రిలీజ్ డేట్- శంకర్‌కి ప్రామిస్ చేశారంట!
2.o Release date Out ‘2.ఓ’ రిలీజ్ డేట్- శంకర్‌కి ప్రామిస్ చేశారంట!
Advertisement
Ads by CJ

శంకర్ - రజినీకాంత్ కాంబోలో గత రెండున్నరేళ్ల ముందు మొదలైన ‘2.ఓ’  సినిమా ఎట్టకేలకు విడుదల కాబోతుంది. ఇప్పటి వరకు విడుదల తేదీలను మార్చుకుంటూ వస్తూ... సినిమా మీద క్రేజ్ తగ్గించుకుంటుందని ప్రచారం జరుగుతున్న తరుణంలో ఇప్పుడు ‘2.ఓ’ సినిమా విడుదల తేదీ బయటికి వచ్చింది. ఇప్పటి వరకు విఎఫెక్స్ పనులతో ‘2.ఓ’ సినిమా విడుదల డిలే అవుతూ వచ్చింది. అయితే గత కొన్ని రోజుల నుండి  ‘2.ఓ’ సినిమా మీద ఎలాంటి అప్ డేట్స్ లేవు.  ‘2.ఓ’ నిర్మాతలు లైకా ప్రొడక్షన్స్ వారు కూడా సైలెంట్ అయ్యేసరికి ఈ ఏడాదిలో ఇక ‘2.ఓ’ సినిమా విడుదల లేనట్లే అని అందరూ డిసైడ్ అయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ వరకు ‘2.ఓ’ సినిమా విషయంలో హాట్ హాట్ చర్చలే జరిగాయి. కానీ గ్రాఫిక్స్ వలన సినిమా విడుదల పోస్ట్ పోన్ ల మీద పోస్ట్ పోన్ లు అవడంతో.. అసలా సినిమా విషయాలు మీడియాలో రావడమే తగ్గిపోయాయి. అలాగే ‘2.ఓ’ సినిమా కొన్న బయ్యర్లు ఢీలా పడినట్లుగా వార్తలొచ్చాయి.

అయితే ఇప్పుడు తాజాగా ‘2.ఓ’ సినిమా దర్శకుడు శంకర్ ఈ సినిమా విడుదలపై స్పష్టమైన క్లారిటీ ఇచ్చేశాడు. తాజాగా శంకర్ ట్వీట్ చేస్తూ ‘2.ఓ’ సినిమా నవంబర్ 29 న విడుదలవుతుందని... ఎట్టకేలకు విఎఫెక్స్ పనులు కొలిక్కి రావడంతో.. ఈ సినిమా డేట్ ఎనౌన్స్ చేస్తున్నట్లుగా  ట్వీట్ చేశాడు. దీనితో...  ‘2.ఓ’  సినిమా నవంబర్ 29  రావడం పక్కా అయ్యింది. ప్రస్తుతం భారీ క్రేజ్ ఉన్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అక్షయ్ కుమార్ విలన్ గా, అమీ జాక్సన్ హీరోయిన్ గా సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ఈ సినిమా భారీ పెట్టుబడి అంటే దాదాపుగా 450 కోట్ల పెట్టుబడితో లైకా ప్రొడక్షన్స్ వారు నిర్మించారు. అయితే అంతకు మించి ఈ సినిమాకు బిజినెస్ జరిగిందనే టాక్ ఉంది.

2.o Release date Out:

Shankar Announces 2.o Release Date

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ