వేశ్యవృత్తి, మరీ ముఖ్యంగా అర్ధరాత్రి వేళల్లో జాతీయ రహదారుల్లో రోడ్లపై నిలబడి విటులను ఆకర్షించే వేశ్యల జీవితం ఆధారంగా గతంలో విజయ్‌తో 'తమిళన్' చిత్రానికి దర్శకత్వం వహించిన మజీద్ ఓ చిత్రం తీస్తున్నాడు. ఇందులో ప్రధాన వేశ్యగా, లీడ్‌రోల్‌లో సదా నటిస్తోంది. ఈ చిత్రం టైటిల్ కూడా కథా వస్తువుకు అనుగుణంగా 'టార్చ్‌లైట్' అని పేరు పెట్టారు. కాగా ఈ చిత్రం ఇప్పటికే పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాల వల్ల జాప్యం అవుతోంది.
ఇక ఇటీవల ఈ చిత్రాన్ని సెన్సార్‌కి పంపించగా ప్రాంతీయ సెన్సార్‌బోర్డ్ ఈ చిత్రంలో అశ్లీలత ఎక్కువగా ఉందని చెప్పి, 'ఎ' సర్టిఫికేట్ కూడా ఇవ్వకుండా సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిరాకరించింది. దీంతో ఈ చిత్రం నిర్మాతలు కేంద్రసెన్సార్‌బోర్డ్‌కి వెళ్లిట్రైబ్యునల్‌ని ఆశ్రయించి సెన్సార్ సర్టిఫికేట్ తెచ్చుకోవాలని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మరోవైపు ఎంతో కాలం తర్వాత సదా ఈ లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా రీఎంట్రీ ఇస్తోంది. ఈ పాత్రను ఎందరో నటీమణులకు దర్శకుడు వినిపించినా, ఇందులోని అశ్లీలత, ఇతర అసభ్యకర సన్నివేశాలు ఉండటంతో ఇందులో నటించడానికి త్రిషతో సహా ఎవ్వరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
అయినా ఏ మెసేజ్‌లోని కమర్షియల్ చిత్రాలలోని అశ్లీలత, అసభ్యతను పట్టించుకోకుండా, భారీ బడ్జెట్ చిత్రాలు, స్టార్స్ చిత్రాలను చూసి చూడనట్లు వ్యవహరించే సెన్సార్‌బోర్డ్ దాదాపు ప్యార్‌లల్ కోణంలో రా సినిమాగా మెసేజ్ ఓరియంటెడ్‌గా తీసిన తమ చిత్రానికి అభ్యంతరాలు చెప్పడం ఏమిటని నిర్మాత, దర్శకులు మండిపడుతున్నారు.