తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు తన నాలుగేళ్ల పాలనలోనే తానేంటో నిరూపించుకున్నాడు. ఇక కేటీఆర్, హరీష్‌రావు, కవిత వంటి వారు కూడా ఆయనకు తగ్గ వారసులమని ప్రజల హృదయాలలో బలంగా నాటారు. డ్రగ్స్ కేసుల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల వరకు కేసీఆర్ ప్రభుత్వం పేద, గొప్ప అనే తేడా లేకుండా అందరిపై చర్యలు తీసుకుంటోంది. ఒకనాడు పెద్దలకు పెద్ద మనుషులకు డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే లెక్క ఉండేది కాదు. కానీ నేడు మాత్రం దీనిని కఠినంగా అమలు పరుస్తున్నారు.
ఇక తాజాగా కత్తి మహేష్ వ్యాఖ్యలపై కూడా తెలంగాణ ప్రభుత్వం కఠినచర్యలే తీసుకుంది. ఒకవైపు ముస్లిం పక్షపాతిగా కేసీఆర్‌కి పేరున్నా సరే.. ఆయన హిందువుల మనోభావాలను కూడా గౌరవిస్తున్నాడని కత్తి మహేష్ ఉదంతం చూస్తే అర్ధమవుతోంది. శ్రీరాముడు, రామాయణంపై తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కత్తి మహేష్‌పై హిందు సమాజం మండిపడుతోంది. దాంతో ఆ ఆగ్రహ తీవ్రతను గుర్తించిన తెలంగాణ సర్కార్ కత్తి మహేష్‌పై మూడు నెలల హైదరాబాద్ బహిష్కరణ విధించింది. ఈ విషయంపై తెలంగాణ డీజీపీ మహేంద్రరెడ్డి మాట్లాడుతూ, బహిష్కరణ సమయంలో నగరంలోకి ప్రవేశించడానికి ప్రయత్నిస్తే మూడేళ్ల జైలు కత్తికి ఖాయమని స్పష్టం చేశాడు. రానున్న రోజుల్లో జరగబోయే పరిణామాలను దృష్టిలో ఉంచుకుని ఏకంగా తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఆయనను బహిష్కరించే అవకాశం ఉందని స్పష్టం చేశాడు.
అంతేకాదు.. సోషల్ మీడియాలో కూడా ఆయన వ్యాఖ్యలు చేయడానికి వీలులేదని, ఏపీలో ఉంటూ సోషల్ మీడియాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా ఆయనకు మరింత కఠిన శిక్ష పడకతప్పదని తేల్చిచెప్పాడు. కానీ మరోవైపు ఏపీలోని తెలుగుదేశం ప్రభుత్వం, అందునా కత్తి మహేష్ సొంత జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కత్తి మహేష్ వ్యాఖ్యలపై నిమ్మకు నీరెత్తినట్లు ఉండటం గమనార్హం.