ఒక రెండ్రోజుల క్రితం 'హలో గురు ప్రేమ కోసమే' సెట్స్ లో హీరోయిన్ మరియు కూతురు పాత్ర పోషిస్తున్న అనుపమ పరమేశ్వరన్ కి ఫాదర్ క్యారెక్టర్ ప్లే చేస్తున్న ప్రకాష్ రాజ్ కి మధ్య గొడవ జరిగిందని, కోపంతో ప్రకాష్ రాజ్ సెట్స్ నుంచి వెళ్లిపోగా, అనుపమ ఏడ్చుకుంటూ కూర్చుందని.. ఇక చేసేదేమీ లేక దర్శకుడు త్రినాధరావు నక్కిన షూటింగ్ పేకప్ చెప్పేశాడనే వార్తలు ఆన్ లైన్ లో హల్ చల్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కొన్ని పాపులర్ ట్విట్టర్ అకౌంట్స్ ఈ న్యూస్ పోస్ట్ చేసేసరికి అందరూ ఈ వార్త నిజమే అనుకొన్నారు. కట్ చేస్తే.. ఒకరోజు తర్వాత అనుపమ ప్రకాష్ రాజ్ తో కలిసి నవ్వుతూ తీసుకున్న సెల్ఫీ పోస్ట్ చేసి 'ఆ జోకులేంటో..?' అని స్మైలీస్ పెట్టింది.
అయితే.. ఇక్కడ కామెడీ ఏంటంటే అనుపమ-ప్రకాష్ రాజ్ ల మధ్య గొడవ అయ్యిందని ప్రముఖ వెబ్ సైట్స్ లో ఎక్కడా న్యూస్ రాలేదు. కేవలం సోషల్ మీడియాలో కాస్త హైలైట్ అయిన ఇష్యూకే దిల్ రాజు ప్రొడక్షన్ లాంటి భారీ సంస్థ నుంచి ఈ అనవసరమైన క్లారిఫికేషన్స్ ఇవ్వడం వలన.. వీళ్ళు ఇష్యూని కవర్ చేస్తున్నారు అనిపించడం గమనార్హం. అసలు ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వకున్నా ఈ ఇష్యూని జనాలు చాలా ఈజీగా మర్చిపోయేవారు. కానీ.. అనుపమ తన ట్విట్టర్ ద్వారా క్లారిటీ ఇవ్వడానికి ప్రయత్నించడంతో.. ఇష్యూ మరింత మందికి తెలిసింది. ఇకనైనా అనుపమ ఈ తరహా ఇష్యూస్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం మానేసి ఇగ్నోర్ చేయడం నేర్చుకోవాలి.