Advertisementt

గాసిప్స్ ని సమంత సైన్లతో కొడుతోంది..!

Tue 10th Jul 2018 07:06 PM
samantha,taxi driver,girisaaya,hollywood remake  గాసిప్స్ ని సమంత సైన్లతో కొడుతోంది..!
Samantha plays taxi driver in Girisaaya film గాసిప్స్ ని సమంత సైన్లతో కొడుతోంది..!
Advertisement
Ads by CJ

పెళ్లి తర్వాత సమంత కెరీర్ భీభత్సమైన స్పీడు లో సాగిపోతుంది. వరస హిట్స్ కొడుతున్న సమంత చేతి నిండా సినిమాలే. టాలీవుడ్, కోలీవుడ్ లో ఏ అవకాశాన్ని సమంత వదిలిపెట్టడం లేదు. తెలుగులో యు - టర్న్ అనే కన్నడ రీమేక్ లో మెయిన్ లీడ్ లో నటిస్తుంది. ఇక కోలీవుడ్ లో అయితే రెండు సినిమాల్తో ఫుల్ బిజీగా వున్న సమంత తర్వాత తన భర్త నాగ చైతన్య తో కలిసి నిన్ను కోరి దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వలో మరో సినిమా చేయబోతుంది. కెరీర్ లో గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్న సమంత పై ఒక చిన్న రూమర్ ప్రచారంలోకి వచ్చింది. సమంత సినిమాల నుండి తప్పుకుని హాయిగా గడపాలనుకుంటుంది అని.

కానీ సమంతకొస్తున్న ఆఫర్స్ చూస్తుంటే సమంత ఇప్పట్లో సినిమాలకు బై బై చెప్పే పరిస్థితి అయితే లేదు. ఇక సమంత గతంలో నటనకు ప్రాధాన్యమున్న సినిమాల్లోనే నటిస్తానని ఓపెన్ గానే ఒక ఇంటర్వ్యూలో చెప్పింది. అనుకున్నట్టుగానే సమంత రంగస్థలంలో రామలక్ష్మి పాత్రని, మహానటిలో మధురవాణి పాత్రని, యు టర్న్ లో కూడా జర్నలిస్ట్ పాత్రలో నటిస్తుంది. తాజాగా సమంత ఒక హాలీవుడ్ రీమేక్ లో నటించబోతుందని న్యూస్ ప్రచారం జరుగుతుంది. హాలీవుడ్‌లో హిట్టయిన థ్రిల్లర్ సినిమా కొలాటెరల్ ని టాలీవుడ్‌లో రీమేక్ చేసే ఏర్పాట్లలో అర్జున్ రెడ్డి ఫేం సందీప్‌రెడ్డి శిష్యుడు గిరిసాయ ఉన్నాడట. 

హాలీవుడ్ మూవీలో టామ్ క్రూయిజ్ ప్రధానపాత్ర పోషించగా...  తెలుగులో సమంత కీలక పాత్రలో కనిపిస్తుందని... సమంత  ఈ రీమేక్ లో ట్యాక్సీ డ్రైవర్‌ పాత్ర పోషించేందుకు సైన్ చేసిందని ఫిలింనగర్ టాక్. థ్రిల్లర్ నేపధ్యమున్న కథ కావడంతో... తన పాత్రకున్న ప్రాధాన్యతతో సమంత  వెంటనే ఈ సినిమాకి ఓకె చెప్పేసిందట. ఇంకా ఈ సినిమాలో అరుణ్ ఆదిత్‌తో పాటు నవదీప్, మురళీశర్మ, సాయిచంద్ కూడా కీలకపాత్రల్లో నటించనున్నారు. మరి ఇలా సమంత తనకు నచ్చిన పాత్రలలోనే నటించేందుకు రెడీ అవుతుంది.

Samantha plays taxi driver in Girisaaya film:

>Samantha’s After Marriage Resolution

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ