వయసు 55 దాటుతున్నప్పటికీ... ఇప్పటికి నవ మన్మధుడులా తన కొడుకులిద్దరికి గట్టి పోటీ ఇస్తున్న నాగార్జున 'ఆఫీసర్' మూవీ తర్వాత శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో హీరో నానితో కలిసి 'దేవదాస్' అనే మల్టీస్టారర్ లో నటిస్తున్నాడు. ఇక నాగార్జునని టాలీవుడ్ మన్మథుడిగా అభివర్ణిస్తారు. ఈ వయసులోనూ మంచి ఫిట్ నెస్ తో నాగ్ లుక్స్ ఇంకా కుర్రాడిలానే కనబడతాయి. మరి అంతగా ఫిట్ నెస్ అండ్ యంగ్ లుక్స్ తో ఉండే నాగార్జున ఒక్కసారిగా ముసలాడిలా కనబడితే అక్కినేని అభిమానులతో పాటు మాములు ప్రేక్షకుల పరిస్థితి ఏమిటి. ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూ నిజంగానే అక్కినేని నాగార్జున వృద్ధ గెటప్ లో దర్శనమిచ్చాడు. తాజాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నాగార్జున పై లుక్ చూస్తే మీరే అంటారు.. అమ్మో నాగార్జున ఈ ముసలోడి గెటప్ ఏమిట్రా బాబు అని.
మరి నాగార్జున ఇలా ఉన్నట్టుండి ముసలివాడిగా మారిపోయి.. కళ్ళకు ఓల్డ్ టైప్ కళ్లజోడుతో.. నెరిసిన జుట్టు అండ్ నెరిసిన గెడ్డంతో.. మెడలో ఎర్రతుండుతో నాగ్ లుక్స్ మాత్రం అచ్చం ముసలి వాడిగా అదరగొట్టేసాడు. మరి ఈ ఓల్డ్ నాగార్జున పక్కన ఒక పాప కూడా ఉంది. నాగార్జున ఈ ముసలి గెటప్ లో ఆ పాపని తన పక్కనే నుంచో బెట్టుకుని మరీ ఫోటోకి ఫిజిచ్చాడు. మరి గతంలో అన్నమయ్యలో నాగార్జున ఇలాంటి గెటప్ లో కనబడ్డప్పటికీ... అది సినిమాలోని ఒక వేషం. మరి నాగార్జున ఇప్పుడు మనం చూస్తున్న లుక్ ఏ సినిమా కోసం అనేది క్లారిటీ రావడం లేదు.
ఎందుకంటే నాగ్ ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య.. 'దేవదాస్'లో మాత్రమే నటిస్తున్నాడు. మరి నాగ్ ఈ ఓల్డ్ గెటప్ ఈ దేవదాస్ లోది అవునా కదా అనేది దేవదాస్ టీమ్ ఎవరైనా చెబితే తెలుస్తుంది.. లేదంటే ఆ లుక్ వెనుక కహాని ఇదని అందరూ ఏదేదో చెప్పేస్తారు. ఇప్పటికే ఈ లుక్ కళ్యాణ్ జూవెల్లెర్స్ కోసమేనంటూ వార్తలు వచ్చేశాయి. మరి నాగార్జున, నాని లు ఈ ఓల్డ్ దేవదాస్ టైటిల్ తో ఎలాంటి మిరాకిల్స్ సృష్టిస్తారో అనేది ఈ దసరాకే తెలిసేలా కనబడుతుంది. ఎందుకంటే నాగ్ - నాని ల దేవదాస్ దసరా బరిలో నిలిపేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు.