బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత అందునా మోదీ ప్రధాని అయిన తర్వాత దేశంలో కాస్త మత అసహనం ఏర్పడింది నిజమేగానీ మోదీ వంటి బలమైన ప్రధాని ఉండబట్టే చాలా వరకు హిందు మతంపై సాగుతున్న దాడికి కాస్తైనా అడ్డుకట్ట పడింది. లేకపోతే కత్తిమహేష్‌లు, కంచె ఐలయ్యల వంటి వారిని ఆపడం వీలయ్యే పనికాదు. ఈ విషయంలో మోదీని చూసి భయంతోనైనా కొందరు నోరు మూసుకుంటు ఉన్నారు. ఇక సీతారాముల గురించి, రామాయణం గురించి కత్తి మహేష్ చేసిన నీచమైన వ్యాఖ్యలు, సీత రావణుడితో ఉండి ఉంటే బాగా ఎంజాయ్ చేసి ఉండేది అనే కామెంట్స్‌ని బిజెపి నాయకురాలు, సినీ నటి మాధవీలత తీవ్రంగా ఖండించింది.
వాడు వీడు? అని మాట్లాడటం నాకు చేతకాదు. అలా నేను కెమెరాల ముందు అనను. కానీ ఈ సందర్భంగా నేను ఓ అమ్మాయిలా ఇలా అనాల్సివస్తోంది. ఎన్నియుగాలు, తరాలు మారినా సాధ్వి సీతమ్మను భారతదేశంలోని మహిళలు స్ఫూర్తిగా తీసుకుంటారు. అసలు కత్తి మహేష్ ఏం మాట్లాడుతున్నాడు? వేరే మతం వారిని ఆయన ఇలా కామెంట్ చేయగలడా? సీత రామణుడి వద్ద ఉంటే బాగా ఎంజాయ్ చేసేదని చేసిన వ్యాఖ్యలకు నేనైతే చెప్పుతీసుకుని కొడతా.
కత్తిమహేష్ దుర్మార్గాలను భరించలేకనే ఆయన భార్య ఆయన్ని వదిలి వెళ్లిపోయింది. అలాంటి వ్యక్తి హిందు దేవుళ్లపై రాముడు, సీత వంటి వారిపై వ్యాఖ్యలు చేస్తాడా? బిజెపి తరపున కంటే ఓ అమ్మాయిగా ముందు నేను మాట్లాడుతున్నాను. కత్తిమహేష్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నానని ఘాటు వ్యాఖ్యలు చేసింది.