Advertisementt

రేణుదేశాయ్ రూటు మార్చిందిగా...!

Mon 09th Jul 2018 09:35 AM
renu desai,pawan kalyan,divorce  రేణుదేశాయ్ రూటు మార్చిందిగా...!
Pawan Kalyan's ex-wife Renu Desai reveals he insisted on divorce despite her protests రేణుదేశాయ్ రూటు మార్చిందిగా...!
Advertisement
Ads by CJ

వదినమ్మ అనే మాట ఎంతో గొప్పది. ఎవరైనా నన్ను వదిన అంటే సంతోషిస్తాను. కానీ పవన్‌కళ్యాణ్‌కి మాజీ భార్యగా వదినమ్మ అని పిలిస్తే మాత్రం కోపం వస్తుంది. ఆయనకు ఆల్‌రెడీ మరో పెళ్లయిపోయింది. ప్రస్తుతం ఆయన భార్యే వదిన గానీ నేను కాదు... అని రేణుదేశాయ్‌ చెప్పుకొచ్చింది. ఇటీవల రేణుదేశాయ్‌కి మరో వ్యక్తితో నిశ్చితార్ధం జరిగిన విషయం తెలిసిందే. ఇక తన భర్త పేరు రహస్యంగా ఉంచడంపై ఆమె మాట్లాడుతూ, కిందటి ఏడాదే నేను నా రెండో పెళ్లి విషయం బయటకి చెప్పాను. కానీ పవన్‌ అభిమానుల నుంచి తీవ్రమైన హెచ్చరికలతో కూడిన ఫీడ్‌బ్యాక్‌ వచ్చింది. 

కానీ సోషల్‌మీడియాలో వచ్చే ఇలాంటివి పట్టించుకోవద్దని పలువురు చెప్పారు. కానీ నాకు కాబోయే భర్తకి ప్రమాదం లేకుండా చేయడానికి నేను ఆయన పేరును రహస్యంగా ఉంచాను. ఆయన సినిమా రంగానికి చెందిన వ్యక్తి మాత్రం కాదు. మరికొన్నిరోజుల్లో ఆయన విషయాలు తెలుపుతాను. ఇక నేను పవన్‌ని విడాకులు అడిగినా? లేక ఆయన అడిగాడా? అనేది ఇంతకాలం బయటికి చెప్పలేదు. కానీ నా సన్నిహితులు, కాబోయే భర్త ఇంటి వారు నీ తప్పులేనప్పుడు బయటికి చెప్పమని సూచించారు. పవన్‌ని నేను విడాకులు కోరలేదు. ఆయనే తనకు విడాలకులు కావాలని అడిగాడు. సహజంగా విడాకులు అడిగితే భార్యాభర్తల మధ్య వచ్చే గొడవల వంటివే మా మధ్య కూడా వచ్చాయి. 

ఇక నేను పిల్లలతో కలిసి ఉంటున్నాను. పవన్‌ తనకు తీరిక ఉన్నప్పుడు ఏడాదికి రెండు మూడుసార్లు పిల్లలను చూసేందుకు వచ్చేవాడు. అంటే పిల్లలను ఏడాదిలో పదకొండున్నర నెలలు నేనే చూసుకునే దానిని. నా స్నేహితురాలు నీ భర్తలా నా భర్త ప్రవర్తిస్తే అసలు ఒప్పుకునే దానిని కాదు. ఆయన వచ్చినప్పుడు ఇంత నార్మల్‌గా ఎలా ఉండగలుగుతున్నావు? అని అడిగింది. కానీ నా పిల్లల కోసం నా కోపాన్ని అణిచివేసుకున్నాను. పిల్లలకు పేరెంట్స్‌ ఫ్రెండ్స్‌లా ఉండాలని భావించి నా కోపాన్ని అదుపు చేసుకున్నాను అని చెప్పుకొచ్చింది. 

Pawan Kalyan's ex-wife Renu Desai reveals he insisted on divorce despite her protests:

Renu Desai Revealed Sensational Things About Pawan Kalyan

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ