Advertisementt

సన్నీలో ఈ కోణం చూస్తారా..?

Mon 09th Jul 2018 01:40 AM
sunny leone,web series,sunny leone biopic,july 16  సన్నీలో ఈ కోణం చూస్తారా..?
Sunny Leone Web Series Trailer Released సన్నీలో ఈ కోణం చూస్తారా..?
Advertisement
Ads by CJ

పోర్న్‌స్టార్‌, బాలీవుడ్‌తో పాటు దక్షిణాది ప్రాంతీయ భాషల్లో కూడా పలు చిత్రాలలో నటిస్తూ క్రేజ్‌ తెచ్చుకున్న సెక్స్‌బాంబ్‌ సన్నిలియోన్‌. ప్రస్తుతం ఆమె జీవితంపై 'కరణ్‌జీత్‌కౌర్‌..... ది అన్‌టోల్డ్‌ స్టోరీ ఆఫ్‌ సన్నిలియోన్‌' పేరిట ఓ బయోపిక్‌ రూపొందుతోంది. అయితే ఇది చలన చిత్రంగా కాకుండా ఓ వెబ్‌సిరీస్‌గా రూపొందుతోంది. ఇటీవలే దానిని చూసి రాత్రంతా నిద్ర పోకుండా ఏడుస్తూ ఉన్నానని, తన నిజజీవితం గురించి ఆలోచిస్తూ కుమిలిపోయానని, తనకంటూ దేవుడు వరం అందిస్తే పోర్న్‌స్టార్‌ కాకముందు జీవితాన్ని కోరుకుంటానని సన్నిలియోన్‌ భావోద్వేగం చెందిన విషయం తెలిసిందే. 

ఈ వెబ్‌సిరీస్‌కి చెందిన ట్రైలర్‌ తాజాగా విడుదలైంది. ఇందులో సన్ని పాత్రను రైసా సౌజాని అనే అమ్మాయి పోషించింది. సన్నికి మేకప్‌ వేస్తున్న దృశ్యంతో ఈ ట్రైలర్‌ మొదలైంది. అనంతరం చిన్నతనంలో తాను ఎదుర్కొన్న అవమానాలు, తల్లిదండ్రులు తిట్టడం, మోడలింగ్‌లోకి అడుగుపెట్టడం, ఫొటో షూట్లు, ఇంటర్వ్యూలో సన్నిని అసభ్యంగా అడిగిన ప్రశ్నలు వంటివి చూపించారు.

ఈ వెబ్‌సిరీస్‌ ఈనెల 16నుంచి ఓ ప్రముఖ చానెల్‌లో ప్రసారం కానుంది. మరి ఈ వెబ్‌సిరీస్‌ దాని నిర్వాహకులకు ఆర్ధికంగా ఎలాంటి లాభాలను అందిస్తుందో చూడాలి. ఎందుకంటే ఈ వెబ్‌సిరీస్‌లో సన్ని కూడా నిర్మాణ భాగస్వామి కావడం విశేషం. 

Sunny Leone Web Series Trailer Released:

Web series Based on Sunny Leone’s life to release on July 16

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ