మెగాస్టార్ చిరంజీవి చిన్న అల్లుడు కళ్యాణ్‌దేవ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం 'విజేత'. ఈనెల 12వ తేదీన విడుదలకానుంది. ఈ సందర్భంగా కళ్యాణ్‌దేవ్ మాట్లాడుతూ.. నటనపై చిన్ననాటి నుంచి ఆసక్తి ఉంది. స్కూల్‌డేస్‌లోనే డ్యాన్స్, సింగింగ్, స్కిట్స్ వంటివి చేసి బహుమతులు సాధించేవాడిని. తల్లిదండ్రులు, టీచర్లు బాగా ప్రోత్సహించేవారు. ఇక ఆ తర్వాత వైజాగ్ సత్యానంద్ గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నాను. అది పూర్తి అయిన తర్వాత నా టాలెంట్‌ని ఎలా ప్రూవ్ చేసుకోవాలా? అని ఆలోచిస్తున్న తరుణంలో రాకేష్ శశి ఓ కొత్త హీరో కోసం వెతుకుతున్నాడని తెలిసింది. సత్యానంద్‌గారు రాకేష్‌శశికి నా పేరును సూచించారు. ఆయన వెంటనే నాకు కథ చెప్పారు. ఎంతో బాగా నచ్చడంతో చిరంజీవి గారివద్దకు తీసుకెళ్లాను.
ఈ కథ విని చిరంజీవి గారు థ్రిల్‌గా ఫీలయ్యారు. వెంటనే గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారు. మొదట్లో ఈ చిత్రానికి చాలా టైటిల్స్ అనుకున్నాం. కానీ సినిమా పూర్తి అయిన తర్వాత 'విజేత' అనే టైటిల్ అయితే కథకు కరెక్ట్‌గా సూట్ అవుతుందని దర్శకనిర్మాతలు భావించడంతో అదే టైటిల్‌ని ఖరారు చేశాం. షూటింగ్ సమయంలో దర్శకుడు చెప్పినట్లుగా నేను నటిస్తున్నానా? లేదా? అని దర్శకుడిని అడిగే వాడిని. ఆయన చాలా బాగా చేస్తున్నావని నన్ను ప్రోత్సహించారు. ఇక ఈ చిత్రం ఎప్పుడు రిలీజ్ అవుతుంది? ఎలాంటి ఫలితం వస్తుంది అని ఎంతో టెన్షన్‌గా ఉంది. నా సన్నిహితులు, నిర్మాతలు అందరు ఈ చిత్రంపై ఎంతోనమ్మకంతో, అవుట్‌పుట్ మీద కొండంత కాన్ఫిడెన్స్‌తో ఉన్నారు. అయినా ఈ చిత్రం గురించి ఆలోచిస్తే నాకు టెన్షన్ పెరిగిపోతోందని చెప్పుకొచ్చాడు.