Advertisementt

రెజీనా.. ఆరబోతకు ఫలితం దక్కినట్లే..!!

Sun 08th Jul 2018 10:28 PM
regina,mr. chandramouli,box office,gautham karthik  రెజీనా.. ఆరబోతకు ఫలితం దక్కినట్లే..!!
Regina gets Hit with Mr. Chandramouli రెజీనా.. ఆరబోతకు ఫలితం దక్కినట్లే..!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో కిందా మీద పడినా సరైన అవకాశాలు రాలేదు. చిన్న, మీడియం హీరోలతో చేసిన సినిమాలకు గుర్తింపు వచ్చినా ఆమెకి అవకాశాలు మాత్రం నిల్. అయినా టాలీవుడ్ లో లేని గుర్తింపుని కోలీవుడ్ లో వెతుక్కోవడానికి ట్రై చేసిన ఫలితం శూన్యం.. అందుకే ఈసారి మాములుగా ట్రై చెయ్యలేదు. వీరలెవల్లో అందాల ఆరబోతతో కోలీవుడ్ మీద తన గ్లామర్ పంజా విసిరింది. దెబ్బకి హిట్ అయ్యింది. ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరా అని తెగ ఆలోచిస్తున్నారు కదూ! అదేనండి జ్యో అచ్యుతానంద, కొత్త జంట వంటి సినిమాలతో టాలీవుడ్ లో గుర్తింపు తెచ్చుకున్నప్పటికీ అవకాశాలు లేక అల్లాడిన రెజినా కాసాండ్రా. 

ఇక్కడ సైరైనా అవకాశం లేక... కోలీవుడ్ కి వెళ్లిన ఈ భామ అక్కడ గౌతమ్ కార్తీక్ సరసన మిస్టర్ చంద్రమౌళి అనే సినిమాలో నటించింది. మరి ఆ సినిమాలో రెజీనా అందాల ఆరబోత మాములుగా లేదు. ఆ సినిమా స్టిల్స్, ఆ సినిమా సాంగ్స్ లోను రెజినా రెచ్చిపోయి అందాల అరోబోతకు దిగింది. అయితే సినిమా విడుదలకు ముందే రెజినా హాట్ హాట్ అందాలు అందరి దృష్ట్టిలో పడ్డాయి. అసలు మిస్టర్ చంద్రమౌళి లోని ఒక సాంగ్ అయితే యూట్యూబ్ ని ఒక ఊపు ఊపింది. ఆ సాంగ్ లో రెజీనా ఆరబోసిన అందాలు చూస్తుంటే... అమ్మో ఇంతందం రెజినా ఇప్పటివరకు ఎక్కడ దాచేసిందో... ఉన్నట్టుండి అన్ని చూపించేస్తుంది అంటూ అందరూ చొంగ కార్చారు.

మరి అలా అందాల ఆరబోతకు దిగిన రెజీనాకి మంచి ఫలితం దక్కింది. గత శుక్రవారం కోలీవుడ్ లో విడుదలైన మిస్టర్ చంద్రమౌళి హిట్ టాక్ తెచ్చుకుంది. అయితే ఈ సినిమాలో కేవలం రెజీనా అందాలే.. హిట్ కి కారణం కాలేదు.. ఇంకా ఈ సినిమాలో గౌతమ్ కార్తీక్.. తన తండ్రి, సీనియర్ నటుడు కార్తీక్‌తో కలిసి నటించిన తొలి సినిమా కావడం.... అలాగే రియల్ లైఫ్ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా తమిళులను పడేసింది. అలా సినిమా హిట్ అవడం రెజీనాకి కలిసొచ్చింది. ఇక ఈ సినిమా విజయంతో అమ్మడు కోలీవుడ్ లో జెండా పాతడానికి రెడీ అయ్యింది. ఏదైనా ఈ సినిమా హిట్ తో రెజీనాకు కొత్త బలం, ఉత్సాహం వచ్చేశాయి.

Regina gets Hit with Mr. Chandramouli:

Regina Hot Show gets Sensation at Box Office

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ