సినిమాలలో అయితే నిర్మాతలు, దర్శకులు, తోటి నటీనటులు ఏమి అన్నాపడతారు కాబట్టి... అది వారి ప్రైవేట్ ప్రాపర్టీ కాబట్టి సర్దుకుపోవచ్చు. కానీ రాజకీయాలు అలా కాదు. ఇక పవన్‌లో ఆవేశం ఎక్కువని, ఆయనలో ఆవేశం తప్పితే ఆలోచన ఏమాత్రంలేదని జనాలకు ఇప్పటికే క్లారిటీ వచ్చింది. ఆయన పార్టీ కేవలం మెగాభిమానులు, కాపుల పార్టీగా రూపాంతరం చెందుతోంది. తాజాగా ఈయన రాజకీయాలపై సీనియర్ పొలిటీషియన్, రాష్ట్రంలోని మేధావి వర్గానికి చెందిన రాజకీయనాయకులైన జయప్రకాష్‌నారాయణ్, ఉండవల్లి అరుణ్‌కుమార్, సబ్బంహరి త్రయంలో ఒకడైన సబ్బంహరి పవన్‌పై కాస్త క్లారిటీ ఇచ్చాడు.
ఆయన మాట్లాడుతూ.. బిజెపి డైరెక్షన్‌లో జగన్, పవన్‌లు నడుస్తున్నారు. రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై మౌనం వహిస్తున్నారు. వారి వైఖరి ప్రజలకు అర్ధమైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీ, జనసేన కలిసి పోటీ చేసే అవకాశాలు ఉన్నాయి. పవన్‌వి అవగాహనలేని ఆవేశమైన వ్యాఖ్యలు. పవన్, జగన్‌లు బిజెపిని ఎండగడుతారని ఇక ఆశించడం వృథా. విభజన సమయంలో కాంగ్రెస్ చేసిన రాజకీయాలనే ఇప్పుడు బిజెపి చేస్తోంది. భవిష్యత్తు అవసరాల కోసం ఏపీలో బిజెపి రాజకీయ క్రీడను ప్రారంభించింది. అందులో భాగంగానే పవన్, జగన్‌లు ఆడుతున్నారు.
వచ్చే ఎన్నికల్లో బిజెపితో వైసీపీ కలవదు. పవన్, జగన్‌లు కలిసిపోటీ చేసి ఎన్నికల అనంతరం బిజెపికి మద్దతు ఇస్తారు. అందుకు అనుగుణమైన వాతావరణాన్నిబిజెపి సృష్టిస్తోంది. ఉత్తరాంధ్రలో పవన్ చేసిన వ్యాఖ్యలు ఆయన ఉత్తి ఆవేశానికి, అనుభవరాహిత్యానికి సంకేతాలు. టీటీడీలో పింక్ డైమండ్ లేదని మాజీ ఈవోలంతా నిర్ధారించారు. అయినా పవన్ అదే విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తున్నారు. తనవల్లే అశోకగజపతిరాజు గెలిచారని, టిడిపి అధికారం అనుభవిస్తోందని చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదం. 1983 నుంచి అశోకగజపతిరాజు ప్రతి ఎన్నికల్లో గెలుస్తున్నారు. 30ఏళ్లగా గజపతులు అనుభవించిన పదవులు ఎవరి దయతో వచ్చాయి. 1983లో ఆయన గెలిచినప్పుడు పవన్ స్కూల్‌లో ఉండి ఉంటాడు..అంటూ విశ్లేషించారు.
ఇక పవన్ ఆవేశానికి మరో ఉదాహరణ ఆయనే స్వయంగా బయటపెట్టాడు. పవన్ మాట్లాడుతూ, ఈ ఆవేశానికి భయపడే మా అన్నయ్య చిరంజీవి నాకే తుపాకీ లైసెన్స్ ఇప్పించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను చూసి నేనెక్కడ తీవ్ర వాద ఉద్యమాలలోకి వెళ్తానో అని ఆయన ఆ పని చేశారు. తుపాకీ ఉంటే ఇంట్లో ఉంటాడు అని భావించాడు. అయితే నా ఆవేశం, ఆవేదన అన్యాయం మీద తప్పితే తుపాకీ మీద కాదు. ఈవిషయాన్ని నాడు మా అన్నయ్యకు వివరించలేకపోయాను. ఆ తుపాకీ నా చేతికి వచ్చే సమయానికి దానిని ఎలా వాడాలో కూడా నాకు తెలియదు అని ఆవేశంలో ఊగిపోతూ చెప్పుకొచ్చాడు. ఇది వింటే మనకి పవన్ నటించిన 'జల్సా' చిత్రంలో ఇంటర్వెల్‌కి ముందువచ్చే సీన్ నుంచి అర్థగంట సినిమా గుర్తుకురావడం ఖాయం. పవన్‌జీ.. రాజకీయాలంటే సినిమా కాదు సుమా...!