Advertisementt

సల్లూభాయ్‌ మరో విషయం బయటపెట్టాడు..!

Sun 08th Jul 2018 12:02 PM
salman khan,juhi chawla,propose,marriage,bollywood  సల్లూభాయ్‌ మరో విషయం బయటపెట్టాడు..!
Salman Khan Proposed Marriage To Juhi Chawla సల్లూభాయ్‌ మరో విషయం బయటపెట్టాడు..!
Advertisement
Ads by CJ

బాలీవుడ్‌ కండలవీరుడు, ఐదు పదుల వయసు దాటి ఎంతో కాలం అయినా ఇంకా బ్యాచ్‌లర్‌గా ఉన్న మోస్ట్‌ డిజైరబుల్‌ బ్యాచ్‌లర్‌గా సల్మాన్‌ఖాన్‌కి పేరుంది.ఈయన గతంలో ఐశ్వర్యారాయ్‌, కత్రినాకైఫ్‌, సంగీతా బిజలానీలతో పాటు జాక్వెలిన్‌ ఫెర్నాండేజ్‌ వరకు తనతో నటించిన ప్రతి నటితో ఎఫైర్‌ నడిపేవాడని వార్తలను మూటకట్టుకున్నాడు. అలాంటి వ్యక్తి తాజాగా ఓ ఆశ్చర్యకరమైన నిజాన్ని బయటపెట్టాడు. సల్మాన్‌తో నటించిన వారిలో జుహీచావ్లాకి మాత్రం సల్మాన్‌తో ఎఫైర్‌ నడిపినట్లుగా ఎప్పుడు వార్తలు రాలేదు. 

కానీ సల్మాన్‌ చెప్పిన వాస్తవం వింటే ఆశ్చర్యం వేస్తుంది. తాను జుహీచావ్లాని ఎంతో ఇష్టపడ్డానని, కానీ తమ వివాహం జరగలేదని ఆయన చెప్పుకొచ్చాడు. నాకంటే అమీర్‌ఖాన్‌కి ప్రేక్షకుల్లో ఫాలోయింగ్‌ ఎక్కువ. దాంతో అమీర్‌తో నేను నటించిన 'అందాజ్‌ అప్నా అప్నా' విడుదలను కొంత కాలం వాయిదా వేయించాను. ఆ సమయంలో ఆ చిత్రం విడుదలై ఉంటే ప్రేక్షకులు, మీడియా అటెన్షన్‌ మొత్తం అమీర్‌ మీదనే ఉండేది. ఆ చిత్రం సమయంలో మేము ఎప్పుడు కలిసినా అమీర్‌ తన భార్య గురించే చెబుతూ ఉండేవాడు. దాంతో నాకు కూడా పెళ్లి చేసుకోవాలని, నాకంటూ భార్య కుటుంబం ఉంటే బాగుంటుందని అనిపించేది. ఆ సమయంలో నేను జుహీచావ్లాని ఎంతగానో ఇష్టపడ్డాను. వారింటికి వెళ్లి జుహ్లీని చేసుకుంటానని కూడా చెప్పాను. 

కానీ జుహీ తండ్రికి నేను నచ్చలేదు. అసలు జుహీ తండ్రికి ఏమి కావాలో నాకే అర్ధం కాలేదు. అల్లుడిగా నేను సరిపోనని భావించారు.. అని చెప్పుకొచ్చాడు. కానీ ఈ విషయంలో ఎంత వాస్తవం ఉంది అనే విషయం మాత్రం జుహీ నోరు విప్పితే గానీ తెలియదు. ఎందుకంటే సల్మాన్‌కి ప్రాక్టికల్‌ జోక్స్‌, తమాషాగా పలు కట్టుకథలు చెప్పే అలవాటు కూడా ఉంది. మరి ఈ విషయం నిజంగా చెప్పాడో లేక ఎవరినైనా ఫూల్‌ని చేయడానికి చెప్పాడో ఆ భగవంతునికే తెలియాలి. 

Salman Khan Proposed Marriage To Juhi Chawla:

Salman Khan's Revelation Over his Marriage Proposal to Juhi Chawla 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ