Advertisementt

శివాని రాజశేఖర్ టైమ్ స్టార్ట్స్..!!

Sat 07th Jul 2018 10:56 PM
shivani rajashekar,tamil project,busy heroine,shivani  శివాని రాజశేఖర్ టైమ్ స్టార్ట్స్..!!
Shivani Rajashekar bags a Tamil project శివాని రాజశేఖర్ టైమ్ స్టార్ట్స్..!!
Advertisement
Ads by CJ

యాంగ్రీ యంగ్ మేన్ రాజశేఖర్ లేటెస్ట్ గా 'గరుడ వేగ' సినిమాతో కం బ్యాక్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత చాలా గ్యాప్ తీసుకుని యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్ లో ఓ సినిమా చేయడానికి రెడీ అవుతున్నాడు. ఇది ఇలా ఉండగా రాజశేఖర్ కూతురు శివానీ టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఈ అమ్మడు తెలుగులో ‘2 స్టేట్స్' సినిమాలో అడివి శేష్ సరసన నటిస్తుంది. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ఫస్ట్ లుక్ పోస్టర్ తో పాటు టీజర్ ని కూడా రిలీజ్ చేయనున్నారు. ప్రస్తుతం ఈ అమ్మడు బిజీ అవుతోంది. లేటెస్ట్ గా ఈ బ్యూటీకి బంపర్ ఆఫర్ తగిలింది. తమిళ్ హీరో విష్ణు విశాల్ హీరోగా వస్తున్న మూవీలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది శివానీ.

తమిళనాడు సంప్రదాయ క్రీడ జల్లికట్టు నేపథ్యంలో ఈ సినిమా కథ సాగనుంది. ఈ సినిమాను వెంకటేష్ అనే డైరెక్టర్ డైరెక్ట్ చేస్తున్నాడు. రీసెంట్‌గా శివానీని సంప్రదించిన దర్శకుడు, స్పోర్ట్స్ నేపథ్యం గురించి స్టోరీ లైన్ చెప్పగానే నటించేందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చిందట. మరో వైపు మలయాళంలో మోహన్‌లాల్ కొడుకు ప్రణవ్ కొత్త మూవీ చేయనున్నాడు. ఇందులో కూడా ఆమెను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది. మొత్తానికి తన మొదటి సినిమా ఇంకా రిలీజ్ అవ్వకుండానే వేరువేరు భాషల్లో సినిమాలు చేసే ఛాన్స్ కొట్టేసింది ఈ భామ.

Shivani Rajashekar bags a Tamil project :

Shivani Rajashekar grabs more offers

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ