Advertisementt

ఇలియానా మళ్లీ ఓ ఊపు ఊపడం ఖాయం!!

Sat 07th Jul 2018 02:42 PM
ileana,ravi teja,amar akbar anthony,tollywood  ఇలియానా మళ్లీ ఓ ఊపు ఊపడం ఖాయం!!
Ileana gets a warm welcome to Tollywood ఇలియానా మళ్లీ ఓ ఊపు ఊపడం ఖాయం!!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం ఇలియానా బాలీవుడ్ నుండి టాలీవుడ్ కి వచ్చి చేరింది. గతంలో టాలీవుడ్ లో హిట్ సినిమాల్తో కెరీర్ పీక్స్ లో ఉండగా బాలీవుడ్ ఆఫర్ రాగానే అక్కడ సెటిల్ అవుదామనుకున్న ఇలియానా కి బాలీవుడ్ షాక్ ఇచ్చింది. బాలీవుడ్ అవకాశాల కోసం కాచుకుని కూర్చున్న ఇలియానా టాలీవుడ్ ని తిట్టి పోసింది. టాలీవుడ్ దర్శకులు కేవలం నడుమందాలు చూస్తారంటూ... వెటకారంగా మాట్లాడింది. అయితే బాలీవుడ్ లో అమ్మడుకి ఓ అనుకున్నంత అవకాశాలు అయితే రాలేదు. ఇక కొన్నాళ్ళు బాయ్ ఫ్రెండ్ తో చెట్టాపట్టాలేసుకుని తిరిగిన ఇలియానాకి టాలీవుడ్ నుండి శ్రీను వైట్ల పిలిచి రవితేజ సరసన 'అమర్- అక్బర్- ఆంటోని' సినిమాలో హీరోయిన్ అవకాశం ఇచ్చాడు.

ఇక ఇలియానా మారుమాట్లాడకుండా రవితేజ సినిమాలో చెయ్యడానికి ఒప్పేసుకుంది. అయితే అమ్మడుకి ఈ అవకాశంతో మళ్ళీ లక్కు తిరిగి వచ్చినట్లే కనబడుతుంది. ఎందుకంటే టాలీవుడ్ లో ప్రస్తుతం హీరోయిన్స్ కొరత బాగా ఉంది. కేవలం పూజ హెగ్డే, కైరా అద్వానీ లు మాత్రమే స్టార్ హీరోలకు హీరోయిన్స్ గా కనబడుతున్నారు. ఎందుకంటే ప్రత్యామ్నాయంగా మరో హీరోయిన్స్ ఎవరూ కనబడడం లేదు. అందుకే చాలామంది దర్శక హీరోలు కొత్త హీరోయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ఇప్పుడు తిరిగి టాలీవుడ్ లోకి అడుగుపెడుతున్న ఇలియానా మీద దర్శక నిర్మాతల చూపు పడింది.

రవితేజ సినిమాకి షూటింగ్ లో జాయిన్ అయిన ఇలియానాపై ఇప్పుడు స్టార్ హీరోలతో సినిమాలు తెరకెక్కించే దర్శకనిర్మాతలు కన్ను పడిందట. మరి టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన అనతి కాలంలోనే టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఇలియానాకి మైండ్ పాడై బాలీవుడ్ లో చక్రం తిప్పుదామనుకుని ఉసూరుమంది. మళ్ళీ ఇప్పుడు టాలీవుడ్ లోకి రీ ఎంట్రీ ఇస్తున్న ఇలియానాకి మళ్ళీ లక్కు కలిసొచ్చేలాగే కనబడుతుంది. చూద్దాం ఇలియానా రి ఎంట్రీ హిట్ అవుతుందో... లేకుంటే ప్లాప్ అవుతుందో అనేది. కానీ రవితేజ సరసన నటిస్తున్న అమర్- అక్బర్- ఆంటోని సినిమా హిట్ అయ్యిందా ఇలియానా సుడి తిరిగినట్లే.

Ileana gets a warm welcome to Tollywood :

Ileana to return to Telugu films with upcoming Ravi Teja-starrer Amar Akbar Anthony

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ