క్యాన్సర్‌కు వైద్యులు ఏవేవో కారణాలు చెబుతూ ఉంటారు. కానీ క్యాన్సర్ బారిన పడిన కొందరు ప్రముఖులను చూసుకుంటే యువరాజ్‌సింగ్, లీసారే, గౌతమి, మనీషాకోయిరాల, ఇర్ఫాన్‌ఖాన్ వంటి ఎందరో కనిపిస్తారు. ఆహార అలవాట్లు, ఇతర కారణాలను క్యాన్సర్‌కి కారణంగా పలువురు భావిస్తూ ఉంటారు. కానీ నిత్యం ధనవంతులైన గొప్పగొప్పవారు కూడా ఎంతో పౌష్టికాహారం కలిగిన ఆహారం తీసుకుంటూ, నిత్యం వ్యాయామం చేస్తూ నిత్యం ఫిట్‌నెస్‌తో ఉండేవారు కూడా దీని మహమ్మారిని పడుతున్నారంటే నేటి కాలుష్యం, కలుషితమైన ఆహారం వంటివి కూడా కారణమనే చెప్పాలి. ఇక నిరక్ష్యరాస్యత వల్ల మొదటి స్టేజీలలో వీటిని గుర్తించలేకపోతున్నారని చెబుతున్న.. ఈ సెలబ్రిటీలందరు ఎంతో చదువుకున్న వారే కావడం గమనార్హం. ఇక తెలుగులో మహేష్‌బాబుతో 'మురారి, అంతకుముందే తమిళ డబ్బింగ్ 'ప్రేమికులరోజు', చిరంజీవి 'ఇంద్ర, కృష్ణవంశీ 'ఖడ్గం, నాగార్జున 'మన్మధుడు, బాలకృష్ణ 'పల్నాటి బ్రహ్మనాయుడు, చిరంజీవి 'శంకర్‌దాదా ఎంబిబిఎస్' వంటి చిత్రాలలో తన అందం, అభినయంతో ఆకట్టుకున్న ముద్దుగుమ్మ సోనాలిబింద్రే కూడా క్యాన్సర్ బారిన పడింది.
ఈమె తెలుగులో నటించిన చిత్రాలలో 'పల్నాటి బ్రహ్మనాయుడు' తప్ప అన్ని అద్భుత విజయాలను సాధించాయి. తనకు హైగ్రేడ్ క్యాన్సర్ ఉందని తేలిందని, తీవ్ర స్థాయిలో ఉండటం వల్ల ఇది శరీరంలోని అన్ని అవయవాలకు వ్యాపించిందని సోనాలిబింద్రే ఉద్వేగంతో తెలియజేసింది. ఆమె మాట్లాడుతూ, కొన్ని సందర్భాలలో తక్కువగా ఊహించినప్పుడు అనుకోనివి జరుగుతుంటాయి. హైగ్రేడ్ క్యాన్సర్ నాకు ఉన్నట్లు తేలింది. ఇది శరీరంలోని ఇతర అవయవాలకు కూడా వ్యాపించింది. అదే పనిగా నొప్పి బాధిస్తుండటంతో పరీక్షలు జరిపితే క్యాన్సర్ విషయం బయటకు వచ్చింది. కుటుంబ సభ్యులు, స్నేహితులు నాకు అండగా నిలిచారు. అందరికీ ధన్యవాదాలు అని ట్వీట్ చేసింది.
అయితే నేను ఆశ కోల్పోలేదు. ధైర్యంగా క్యాన్సర్‌తో పోరాడుతాను. వెంటనే సత్వర చర్యలు తీసుకోవడం మినహా చేయగలిగింది ఏమీ లేదు. కనుక వైద్యుల సూచనతో న్యూయార్క్‌లో ట్రీట్‌మెంట్ తీసుకుంటున్నాను. ఆశాభావంతో క్యాన్సర్‌పై పోరాడుతానని తెలిపింది. నిత్యం డాక్టర్లచేత బాడీ చెకప్‌లు చేసి ఆరోగ్యంపై ఎక్కువ శ్రద్ద చూపే వారిని కూడా క్యాన్సర్ మహమ్మారి కబళిస్తూ ఉండటం ప్రమాదకర సంకేతం. ఈ విషయంలో సోనాలి బింద్రే ఈ మహమ్మారిని జయిస్తుందని ఆశిద్దాం.