సౌత్ ఇండస్ట్రీలో ఏ సినిమా అయినా 150 కోట్ల గ్రాస్ సాధిస్తే అది గొప్ప విషయం. అది బ్లాక్ బస్టర్ అయినట్టు లెక్క. కానీ అంత వసూల్ సాధించి డిజాస్టర్ గా నిలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఈ ఫిగర్ వేరే హీరోస్ కి ఎక్కువ కావొచ్చు కానీ రజినీకాంత్ విషయం అలా కాదు. అంత కలెక్షన్స్ రాబట్టినా దాన్ని హిట్ లిస్ట్ లో వేయలేం.
లేటెస్ట్ గా సూపర్ స్టార్ రజనీకాంత్ 'కాలా' విషయంలో కూడా అదే జరిగింది. డివైడ్ టాక్ తో తెలుగు రాష్ట్రాల్లో దారుణమైన వసూళ్లతో పెద్ద డిజాస్టర్ అయింది. ఒక్క తమిళనాడులోనే ఈ చిత్రం ఒక మోస్తరుగా ఆడింది. లేటెస్ట్ గా ఈ చిత్రం 150 కోట్ల గ్రాస్ మార్క్ ని దాటింది. రజినీ 'రోబో'..'కబాలి' సినిమాల తర్వాత ఈ ఘనత సాధించిన సినిమాగా ‘కాలా’ రికార్డులకెక్కింది.
సౌత్ ఇండస్ట్రీలో మరో హీరో ఇన్నిసార్లు 150 కోట్ల మార్క్ ను దాటలేదు. కానీ ఏమి లాభం సినిమా టాక్ బాగోకపోవడంతో జనాలు థియేటర్స్ కు కూడా రాని పరిస్థితి. ఒక్క తమిళంలో మాత్రమే బయ్యర్లు స్వల్ప నష్టాలతో బయటపడ్డారు కానీ.. మిగతా అన్ని చోట్లా భారీ నష్టాలు తప్పలేదు. తెలుగులో ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం రూ.7.5 కోట్ల షేర్ మాత్రమే వచ్చింది. ఇక మిగిలిన రాష్ట్రాల్లో భారీ నష్టాలు తెచ్చింది. అందుకే 150 కోట్ల గ్రాస్ సాధించినా ఈ చిత్రానికి పరాజయం తప్పలేదు.