Advertisementt

పవన్‌ కూడా రాజకీయాలు మొదలెట్టాడు..!

Wed 04th Jul 2018 01:06 PM
pawan kalyan,power,2019,andhra pradesh,janasena party  పవన్‌ కూడా రాజకీయాలు మొదలెట్టాడు..!
Pawan Wants To Become CM At Any Cost పవన్‌ కూడా రాజకీయాలు మొదలెట్టాడు..!
Advertisement
Ads by CJ

ప్రజల భావోద్వేగాలతో ప్రతి విషయాన్ని రాజకీయం చేయడం నాకిష్టం లేదు. జనసేన అలా ఉండదు. అసలు నాకు సీఎం అవ్వాలని లేదు. సీఎం అయితేనే సమస్యలు పరిష్కరించగలమనే వాదనను నేను ఒప్పుకోను. రాష్ట్ర అభివృద్ది చేయడం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి పనిచేయడమే నేను చేయాల్సిన పని. ఇవి 2017లో జనసేనాధిపతి పవన్‌కళ్యాణ్‌ చెప్పిన మాటలు. కానీ సంవత్సరం, తేదీ మారినట్లుగానే ఆయన మాటల్లో కూడా తేడా వచ్చింది. మమ్మల్ని గెలిపించండి. సీఎంని చేస్తే అన్ని సమస్యలు పరిష్కరిస్తారు. టిడిపి ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేస్తోంది.. ఇవి 2018 వచ్చేనాటికి పవన్‌ నోటి వెంట వస్తున్న మాటలు. 

ఇక్కడ పవన్‌కి తెలియని విషయం ఏమిటంటే.. రాష్ట్రంలో ఉండే సమస్యలు ప్రతి ఒక్కరికి తెలుసు. తమ నియోజకవర్గాలలో, తమ జిల్లాలలో ఉన్న సమస్యలు సామాన్య ప్రజలకు కూడా తెలుసు. కానీ కావాల్సింది సమస్యలను ఎత్తి చూపడం కాదు. దానికి పరిష్కారం ఏమిటో చూపించిన వాడే నిజమైన దార్శనికుడు. ప్రస్తుతం పవన్‌ సమస్యల గురించి మాట్లాడుతున్నాడు తప్పవాటిని ఎలా పరిష్కరిస్తాను. తన వద్ద ఉన్న పరిష్కార మార్గాలు ఏమిటి? ఏమి చేస్తే ప్రాంతీయ అసమానతలు పోతాయి? అనేవి చెప్పకుండా ఆయన ఉత్తరాంధ్ర వెనకబడి ఉంది. టిడిపి పట్టించుకోవడం లేదు అంటున్నాడు. రేపు రాయలసీమకి వెళ్లినా కూడా ఆయన రాయలసీమ వెనుకబడి ఉంది. కాబట్టే అనంతపురం నుంచి పోటీ చేస్తాను అని చెబుతాడు. ఇక ప్రకాశం, నెల్లూరు జిల్లాలలో కూడా వెనుకబాటుతనం ఉంది. దీనిని కూడా ఆయా ప్రాంతాలకు వస్తే పవన్‌ ప్రశ్నిస్తాడు. ఇంత వరకు బాగానే ఉంది. ప్రతి ఎన్నికల్లో ప్రతి నాయకుడు చెప్పే మాటలే ఇవి. కానీ పవన్‌ ఆ సమస్యలను ఎలా పరిష్కరిస్తాడు? సమస్యల పరిష్కార మార్గాలేమిటో చెప్పలేకపోతున్నాడు అనడం కంటే ఆయనకు అవగాహన లేదని చెప్పడం బాగుంటుంది. 

ఇక తాజాగా విజయనగరంలో ఆయన మాట్లాడుతూ, జనసేనకు ఐదేళ్లు పాలించే అవకాశం ఇవ్వండి. ఎప్పటికీ మమ్మల్నే కోరుకునేలా పరిపాలన అందిస్తాం. మేము సరికొత్త మార్పును తీసుకుని వస్తాం. యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పించాల్సి ఉంది. ప్రాంతీయ అసమానతలను పరిష్కరించాల్సి ఉంది. ప్రజల సమస్యలను తీర్చడానికే జనసేన ఆవిర్భవించింది. తెలుగుదేశం పార్టీ ఉత్తారాంధ్రను పట్టించుకోవడం లేదు. ఉత్తరాంధ్ర ప్రజల ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా ప్రభుత్వం లేదు. ఉత్తరాంధ్రకి జనసేన మద్దతుగా ఉంటుంది అంటున్నాడు. 

మరో వైపు ఆయన పొత్తులు లేని పోరాటం చేస్తామని చెబుతుంటే వామపక్షాల నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో మహాకూటమిని ఏర్పరుస్తాం. మాకు పవనే సీఎం అభ్యర్ధి అని ప్రకటిస్తున్నారు. ఇంతకీ పవన్‌కి బిజెపి విషయంలో, వైసీపీ విషయంలో ఆయన స్టాండ్‌ ఏమిటో ముందు బయటపెడితే తర్వాత మిగిలిన విషయాలను ఆలోచించవచ్చనేది రాజకీయ విశ్లేషకులు పవన్‌కి ఇస్తున్న సూచన. మరి మన 'గబ్బర్‌సింగ్‌'కి కాస్త తిక్కుతుంది. మరి ఈ విషయంలో ఆయన లెక్క ఏమిటో తెలియాల్సివుంది...!

Pawan Wants To Become CM At Any Cost:

Does Pawan Kalyan have the ability to lead Andhra Pradesh?

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ