దర్శకనటుడు రవిబాబుది నటనలో ప్రత్యేకశైలి. అంతేకాదు ఆయన దర్శకత్వం వహించే చిత్రాలు కూడా ఎంతో కొత్తగా ఉంటాయి. జయాపజయాలను పక్కనపెడితే రవిబాబు ఓ ట్రెండ్ సెట్టర్. వినూత్నంగా ఆలోచించి, సరికొత్త చిత్రాలు తీయడంలో ఆయన క్రియేటివిటి అద్భుతం. ఈ విషయంలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. ఇక ఆయన సినిమా దర్శకత్వం, నటనలోనే కాదు.. వ్యక్తిగతంగా కూడా తన విలక్షణత చాటుకుంటూ ఉంటాడు.
ఆ మధ్య తాను బంటి అనే పందిపిల్లను పెట్టి 'అదుగో' చిత్రం తీస్తున్న సందర్భంగా ఏటీఎం లైన్‌లో నిల్చునేటప్పుడు, ఓటు వేసేందుకు కూడా అదే పంది పిల్లని ఎత్తుకుని కనిపించాడు. ఇక ఇటీవల ఆ పందిపిల్లకు బ్రష్‌తో పళ్లుతోముతూ ఓ వీడియోని విడుదల చేశాడు. ఇక విషయానికి వస్తే కేంద్రమంత్రి, మాజీ ఒలింపిక్ పతక విజేత రాజ్యవర్ధన్‌సింగ్ రాథోడ్ ప్రారంభించిన ఫిట్‌నెస్ చాలెంజ్‌లో భాగంగా పలువురు సెలబ్రిటీలు తాము వ్యాయామం చేస్తూ, ఇతరులకు చాలెంజ్‌లు విసురుతూ ఉన్నారు. మోదీ నుంచి కోహ్లి వరకు, టాలీవుడ్‌టాప్‌స్టార్స్ కూడా అదే పనిలో ఉన్నారు.
ఇక తాజాగా రవిబాబు తన పందిపిల్లను వీపుమీదకి ఎక్కించుకుని పుషప్స్ తీస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ఈ వీడియో ఇప్పుడు వైరల్ అవుతోంది. ఫిట్‌నెస్ కోసం బంటి (పందిపిల్ల) కూడా వ్యాయామం చేస్తోంది. మరి మీరెందుకు చేయరని ప్రశ్నించాడు. ఈ వీడియో వైరల్ అవుతూ, మీడియాలో కామెంట్స్, షేర్స్‌తో హల్‌చల్ చేస్తోంది. ఇలా పందిపిల్లని తన సినిమాకే కాదు.. తనకి కూడా ప్రమోటర్‌గా క్రియేటివిటీ జోడించిన రవిబాబుకు పలు ప్రశంసలు కూడా లభిస్తున్నాయి.