Advertisementt

కొడుకుపై కూడా సెటైర్లు పేల్చాడు..!

Tue 03rd Jul 2018 02:11 PM
rishi kapoor,ranbir kapoor,sanjay dutt,sanju movie  కొడుకుపై కూడా సెటైర్లు పేల్చాడు..!
Rishi Kapoor to son Ranbir Kapoor: You don’t know how proud your parents are కొడుకుపై కూడా సెటైర్లు పేల్చాడు..!
Advertisement
Ads by CJ

రిషికపూర్‌ ఒకనాటి ఎవర్‌గ్రీన్‌ లవర్‌బాయ్. కపూర్‌ ఫ్యామిలీ నుంచి వచ్చి ఓ ఊపు ఊపాడు. ఇక ఆవేశ పరుడిగా, ముక్కుసూటి మనిషిగా పేరున్న రిషి కపూర్‌ తాజాగా తన కుమారుడిపైనే సెటైర్లు వేయడంతో ఇప్పుడు రణబీర్‌ కపూర్‌ అభిమానుల ట్రోలింగ్‌కి మూల కారణంగా మారాడు. రణబీర్‌కపూర్‌, అలియాభట్‌లు ఎంతో కాలంగా ప్రేమించుకుంటున్నారని వార్తలు వస్తున్నాయి. త్వరలో వారు వివాహం కూడా చేసుకోనున్నారని బిటౌన్‌ మీడియా కోడై కూస్తోంది. తాజాగా విడుదలైన రణబీర్‌కపూర్‌ నటించిన 'సంజు' చిత్రం బ్లాక్‌ బస్టర్‌ దిశగా సాగుతోంది. దీంతో అలియాభట్‌ తన బోయ్‌ఫ్రెండ్‌ నటనను ప్రత్యేకంగా మెచ్చుకుంటూ ఆయనను ప్రశంసలలో ముంచెత్తింది. 

ఇక అలియాభట్‌ విషయానికి వస్తే ఆమె తాను 30ఏళ్ల లోపే వివాహం చేసుకుంటానని చెబుతుండగా, రణబీర్‌కపూర్‌ అది కూడా నోరు విప్పి చెప్పడం లేదు. దీంతో కుమారుడి పెళ్లిపై జోక్‌లు పేలుస్తున్న నెటిజన్లపై సెటైర్లు విసిరాడో, లేక తన కుమారుడి పెళ్లి విషయంలో తీవ్ర నిరుత్సాహానికి లోనయ్యాడో తెలియదుగానీ రిషి కపూర్‌ రణబీర్‌ని ఓ మగాడిని వివాహం చేసుకోమంటూ ట్వీట్స్‌ పేల్చాడు. రణబీర్‌కపూర్‌ దర్శకుడు అయాన్‌ ముఖర్జీలు ఎంతో సన్నిహితులు. దీనిని ఉదాహరణగా తీసుకున్న రిషికపూర్‌.. తన కుమారుడిని ఉద్దేశించి, బెస్ట్‌ ఫ్రెండ్స్‌.. మీ ఇద్దరు వివాహం చేసుకుంటే ఎలా ఉంటుంది? అంటూ పెళ్లి వదంతులకు చెక్‌ పెట్టకపోగా మరింతగా తన కుమారుడిని వివాదంలోకి లాగాడు. 

దాంతో పలువురు నెటిజన్లు నీవు హోమో సెక్సువల్‌వా? నీ తండ్రే ఒప్పుకున్నాడు.. నిజం చెప్పు అంటూ రణబీర్‌ని ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇలా ఏదో అనబోయి చివరకు తన తనయుడికే చిక్కులు తెచ్చిపెట్టాడు ఈ యాంగ్రీ ఓల్డ్‌ మేన్‌. అయినా ఓ అబ్బాయిని  వివాహం చేసుకోమని ఆయన ఎందుకు ట్వీట్‌ చేశాడో అర్ధం కాక ముసలి చాదస్తం అనుకుని రణబీర్‌ సన్నిహితులు, అభిమానులతో పాటు రణబీర్‌ కూడా మౌనాన్నే ఆశ్రయిస్తున్నారు. 

Rishi Kapoor to son Ranbir Kapoor: You don’t know how proud your parents are:

Rishi Kapoor REACTS on Ranbir Kapoor's performance as Sanjay Dutt

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ