మన రాజ్యాంగం మనకి మత స్వేచ్చని, ఇష్టం వచ్చిన మతంలో కొనసాగే హక్కుని, మన మతాన్ని మనం ప్రచారం చేసుకునే హక్కులను ఇచ్చింది. అంతమాత్రాన ఇతర మతాలను, వారి దేవుళ్లను, వారి పవిత్ర గ్రంధాలను చులకన మాట్లాడమని చెప్పలేదు. కానీ వాక్‌స్వాతంత్య్రం, మత స్వేచ్చ మాటున తిరుమల వంటి పవిత్ర ప్రదేశాలలో నిషేధించిన అన్యమత ప్రచారాలను కూడా టిటిడికి చెందిన కొందరు ఉన్నత ఉద్యోగులు, రమణ దీక్షితులు వంటి వారు ప్రోత్సహిస్తున్నారని వీరు వాటికన్ కోవర్టులా వ్యవహరిస్తున్నారని తీవ్ర విమర్శలు వస్తున్నాయి.
ఇక తాజాగా కత్తి మహేష్ శ్రీరాముడిపై పలు దూషణలు చేశాడు. రామాయణం ఓ కల్పిత కథ. రాముడు ఎంత ఉత్తముడని ఇతరులు నమ్ముతారో నేను ఆయనను అంత దగుల్బాజీ అని భావిస్తాను. సీత రావణుడితోనే ఉండిపోయి ఉంటే సరిపోయేది. ఆమెకి అక్కడ అతనితో ఉండి ఉంటేనే న్యాయం జరిగేది అంటూ నోటికి వచ్చిన కూతలు అన్ని కూశాడు. నిజానికి మన హిందు గ్రంథాలు, పురాణాలు, ఇతిహాసాలు అర్ధం చేసుకున్నవారికి అర్ధమైనంత అన్నట్లు ఎన్నో లోతైన విషయాలు కూడా ఉంటాయి. మిడిమిడి జ్ఞానం కలిగిన కత్తిమహేష్ వంటి వారు ఇలా రెచ్చిపోవడం వెనుక ఖచ్చితంగా ఇతర దుష్టశక్తుల హస్తం ఉందనే భావించాల్సి వస్తోంది.
తాజాగా కత్తిమహేష్ వ్యాఖ్యలపై శ్రీరెడ్డి స్పందిస్తూ 'జై శ్రీరాం..దేవుడిని దూషించడం సరికాదు. మా హిందు ధర్మాన్ని హేళన చేయకండి' అని కత్తికి సమాధానం ఇచ్చింది. మరో వైపు హిందు జనశక్తి నాయకులు కత్తిమహేష్‌పై పలు చోట్ల పోలీస్‌స్టేషన్లలో కేసులు నమోదు చేస్తున్నారు. మేక వన్నె పులుల వంటి కత్తిమహేష్ వంటి వారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరించి, మత హింస చెలరేగడానికి కారణంగా చూపుతూ కేసులు నమోదు చేసి మరోసారి చీప్ పబ్లిసిటీ కోసం ఎవ్వరూ ఇలాంటి దొడ్డిదారిలో పయనించకుండా కట్టడి చేయాల్సిన అవసరం ఉంది.