Advertisementt

నాకంటే సమంతే బాగా చేసింది!

Mon 02nd Jul 2018 07:36 PM
rangasthalam,ramalakshmi,anupama parameswaran,samantha,tej i love you  నాకంటే సమంతే బాగా చేసింది!
Anupama Parameswaran about Rangasthalam Ramalakshmi Role నాకంటే సమంతే బాగా చేసింది!
Advertisement
Ads by CJ

సాధారణంగా హీరోయిన్లు తమ పెర్ఫార్మెన్స్ గురించి కాకుండా వేరే హీరోయిన్స్ పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడడానికి ఇష్టపడరు. ఒకవేళ ఏదైనా ఇంటర్వ్యూలో ఆ తరహా టాపిక్ తెచ్చినా.. చాలా తెలివిగా తప్పించుకొంటుంటారు. కానీ.. మలయాళ కుట్టి అనుపమ మాత్రం సమంత మీద ప్రశంసల వర్షం కురిపించింది. ఈ ఏడాది ఇండస్ట్రీ హిట్ కొట్టిన రంగస్థలం సినిమాలో రామలక్ష్మి పాత్రకి తొలుత అనుపమ పరమేశ్వరన్ ను తీసుకొన్నారన్న విషయం తెలిసిందే. ఒక ఫోటోషూట్ మరియు కొన్ని సన్నివేశాల ట్రైల్ షూట్ చేశాక.. ఆ పాత్రలోని సహజత్వం కానీ.. పరిపక్వత కానీ అనుపమ మొహంలో కనిపించకపోవడంతో.. ఆమెను తొలగించి ఆమె స్థానంలో సమంతను తీసుకొన్నారు. 

నిన్న 'తేజ్ ఐ లవ్ యూ' ప్రమోషన్స్ సందర్భంగా మీడియాతో ముచ్చటించిన అనుపమ పరమేశ్వరన్ ను ఈ విషయమై ప్రశ్నిస్తూ.. 'రామలక్ష్మి క్యారెక్టర్ మిస్ అయినందుకు బాధపడుతున్నారా?' అని అడగ్గా.. మొదట్లో 'నేను చేయాల్సిందా?' అని ఏమీ తెలియనట్లు సమాధానం చెప్పకుండా తప్పించుకోవడానికి ప్రయత్నించినప్పటికీ.. లాభం లేకపోవడంతో 'నాకంటే సమంత ఆ పాత్రను అద్భుతంగా పోషించింది, ఆమె 101 శాతం న్యాయం చేసింది' అంటూ సమంతను పొగిడేసి తన ఫీలింగ్స్ మాత్రం దాచేసుకొంది. చూడ్డానికి చిన్నపిల్లలా కనిపిస్తుంది కానీ.. అమ్మడు అంత అమాయకురాలేమీ కాదు.

Anupama Parameswaran about Rangasthalam Ramalakshmi Role:

Anupama Parameswaran Praises  Rangasthalam Ramalakshmi

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ