నవదీప్ నటునిగానే కాదు.. ఈటీవీలో 'సూపర్' ద్వారా హోస్ట్‌గా కూడా మారాడు. ఈ షోలో పార్టిసిపెంట్స్‌తో పలు భయానక ఫీట్లు, పాములతో ఆటలాడించిన నవదీప్ తాజాగా తాను చేయించడమే కాదు.. ఫీట్స్‌ని తాను కూడా చేయగలనని చేతలతో నిరూపించుకున్నాడు. నవదీప్ సినిమాల పరంగా పెద్దగా వార్తల్లో ఉండకపోయినా డ్రగ్స్, బిగ్‌బాస్‌తో పాటు సోషల్ మీడియాలో మాత్రం ఎంతో యాక్టివ్‌గా ఉంటూ ఉంటాడు.
ఇక విషయానికి వస్తే ఎన్టీఆర్ నటించిన 'యమదొంగ' చిత్రంలో ఎన్టీఆర్ 'ఏరా.. పులి' అంటూ పులి మీద డైలాగ్ చెప్పి తనని తాను పులితో పోల్చుకుని, పులితో చెలగాటం వద్దని, పులితో ఫొటోకి మోజు పడవద్దని చెప్పిన డైలాగ్ అందరికీ తెలిసిందే. తాజాగా నవదీప్ ఏదో అడవికో లేక జూకో వెళ్లినట్లు ఉన్నాడు. అక్కడ ఓ పులిలో సెల్ఫీ తీసుకుని దానిని ట్విట్టర్‌లో పోస్ట్ చేశాడు. ఈ సెల్ఫీకి ఆయన కూడా ఎన్టీఆర్ డైలాగ్ అయిన 'ఏరా.. పులి' అంటూ క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ ఫొటో బాగా వైరల్ అవుతోంది. మరి ఈ సెల్ఫీని ఎక్కడ దిగాడు? ఎప్పుడు దిగాడు? అనే విషయాన్ని మాత్రం ఆయన వెల్లడించలేదు.
మొత్తానికి ఈ ఫోటోకి వస్తున్న స్పందన మాత్రం నవదీప్‌కి మంచి ప్రమోషన్‌కి ఉపయోగపడుతోంది. మరి ఈయన ఏవైనా జాగ్రత్తలు తీసుకుని పులితో సెల్ఫీ దిగాడా? లేక నిజంగానే డేర్ చేశాడా? అనేది ఆయన చెబితే గానీ తెలియదు. మొత్తానికి నవదీప్ తను ఆశించిన విధంగానే ఈ ఫొటో ద్వారా వార్తల్లో నిలుస్తున్నాడని చెప్పవచ్చు.