నేటిరోజుల్లో మేధావులుగా తమని తాము నిరూపించుకోవాలన్నా, సెలబ్రిటీలుగా మారాలన్నా కూడా ఎవరినో పెద్ద వారిని టార్గెట్ చేయడం, లేదా హిందువుల మీద హిందువులు పవిత్రంగా భావించే వారి మీద ఇష్టం వచ్చినట్లుగా మాట్లాడి వార్తల్లో నిలుస్తున్నారు. అందునా మీడియా ఇలాంటి వారికి బాగా ప్రోత్సాహం ఇస్తూ ఉండటం కూడా వారికి కలిసి వస్తోంది. ఇలా టీఆర్పీల కోసం మీడియా పడే కక్కుర్తిని కంచె ఐలయ్య నుంచి కత్తి మహేష్ వరకు శ్రీరెడ్డి నుంచి అందరు ఇదే పద్దతిని ఫాలో అవుతుండటం ప్రమాదకర సందేశమేనని చెప్పాలి. ఇక నేటి రోజుల్లో ముస్లింలను, క్రిస్టియన్ల వంటి వారిని మాత్రం ఏమి అనలేని ఈ కుహనా మేధావులు హిందువులు పవిత్రంగా కొలిచే రాముడి మీద, రామాయణం, భాగవతం వంటి వాటి మీద అనుచిత కామెంట్స్ చేస్తున్నారు. అదేమంటే పౌరహక్కులు, దళిత, మైనార్టీ కార్డులను బాగా వాడుకుంటున్నారు.
పవన్‌కళ్యాణ్ మీద ఏవేవో వ్యాఖ్యలు చేసి పవన్ ఫ్యాన్స్ అత్యుత్సాహం, మీడియా దౌర్భాగ్యం వల్ల మేధావి అయిన కత్తి మహేష్ ఈ సారి హిందువులు పవిత్రంగా కొలిచే రామాయణం, రాముని మీద తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై హైదరాబాద్ కెపిహెచ్‌బి కాలనీలో కేసు నమోదైంది. ఈ సందర్భంగా కత్తి మహేష్ రాముడిని దుర్భాషలాడుతూ మాట్లాడటం బాధాకరం. ఇటీవల ఓ న్యూస్ చానెల్‌లో జరిగిన చర్చావేదికలో కత్తిమహేష్ మాట్లాడుతూ, రామాయణ అనేది ఓకథ, కట్టుకధ. ఇది కల్పితం. రాముడు ఎంత ఉన్నత వ్యక్తో అంత దగుల్జా అని నమ్ముతాను. సీతని ఎత్తుకెళ్లిన రావణుడితోనే ఆమె ఉండి ఉంటే బాగుండేదని, అప్పుడైనా ఆమెకి న్యాయం జరిగి ఉండేదని తాను భావిస్తానని అన్నాడు.
అయినా మన పెద్దలు, పురాణాలు, ఇతిహాసాల గొప్పతనం విదేశీయులు గుర్తించినట్లుగా మనం గుర్తించలేక పోవడం పక్కన పెడితే వాటిని తిడుతూ హిందువులలోని అనైక్యతను, వారి నిగ్రహశక్తిని ఇలా తూట్లు పొడవడం అన్యాయం. పవన్ విషయంలో తాను దళితుడిని అని, దళితకార్డు వాడుకుని, పోలీస్‌స్టేషన్‌లో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసును పెట్టిన కత్తి ఈసారి లౌకికవాదం, వాక్ స్వాత్యంత్య్రం, పౌరహక్కులు, హేతువాది కార్డును వాడకోదలుచుకున్నట్లు అర్ధమవుతోంది. మరి ఇలాంటి తీవ్ర వ్యాఖ్యలే అయన ఖురాన్, బైబిల్ మీద ఇలాగే మాట్లాడగలడా? కంచె ఐలయ్య, కత్తి మహేష్ వంటి వారిని ప్రభుత్వాలు అరికట్టాల్సివుందని చెప్పాలి. ఒకపక్క రామసేతు, మధురా వంటివి నిజం అని తేలుతున్న సమయంలో ఇలాంటి వ్యాఖ్యలు గర్హనీయం.