Advertisementt

పవన్‌ ఫ్యాన్స్‌కి ఈ డోస్‌ సరిపోతుందా?

Sun 01st Jul 2018 02:13 PM
renu desai,pawan kalyan,sri reddy,fans,social media  పవన్‌ ఫ్యాన్స్‌కి ఈ డోస్‌ సరిపోతుందా?
Sri Reddy Again Targets Pawan Kalyan Fans పవన్‌ ఫ్యాన్స్‌కి ఈ డోస్‌ సరిపోతుందా?
Advertisement
Ads by CJ

పవన్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండో వివాహం చేసుకుంటున్నారని తెలిసినప్పటి నుంచి ఆమెపై ట్రోలింగ్‌ ఎక్కువైంది. ఈ విషయంలో ఇటీవల దర్శకురాలు నందిని రెడ్డి ఎంటరై చట్టపరంగా పవన్‌, రేణు విడాకులు తీసుకున్నారు. మరి రేణు రెండో పెళ్లి విషయంలో అభిమానులు ఇంత రాద్దాంతం చేయడం ఎందుకు? ఆమెకి ఆ హక్కు ఉంది. పవన్‌ స్వేచ్చకు విలువ ఇస్తారు. కానీ ఆయన అభిమానులు మాత్రం ఇలా చేసి మీ హీరోకి చెడ్డపేరు తేవద్దని చీవాట్లు పెట్టింది. ఈ వ్యవహారం చివరకు రేణు ట్విట్టర్‌ని వదిలేసేంతగా సాగింది.

ఇక తాజాగా రేణుదేశాయ్‌ కూడా పవన్‌ ఫ్యాన్స్‌పై మండిపడింది. ఆమె మాట్లాడుతూ, విడాకుల విషయంలో నేనింత కాలం మౌనంగా ఉన్నాను. దానికి పవన్‌ అభిమానులు నాకు రుణపడి ఉండాలి. మర్యాదగా ప్రవర్తించాలి. విడాకుల విషయంలో నేను నోరు విప్పితే పవన్‌ అభిమానుల పొగరు మురికి కాలువలో కొట్టుకుపోతుంది. విడాకులకు వెనుక ఉన్న వాస్తవాలను చెబితే పవన్‌ఫ్యాన్స్‌కి గర్వభంగం అవుతుంది. పవన్‌ అభిమానులకు మర్యాద తెలియదు. వారు అవివేకులు. నన్ను ట్రోలింగ్‌ చేయడం ఇకనైనా మానుకోవాలి. నా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ఎంట్రీ ఇచ్చి ఏడుపుగొట్టు కథలు చెప్పడం మానుకోవాలి. ఈ నెగటివిటీని నేను తట్టుకోలేను. అసలు వీటిని నేనెందుకు భరించాలి? ముందుగా సలహాలు ఇవ్వడం మానుకోండి... అంటూ మండిపడింది. ఇక సంచలన నటి శ్రీరెడ్డి కూడా రేణుకి మద్దతు తెలిపింది. 

రేణు చాలా చిన్నవయసులోనే విడాకులు తీసుకున్నారు. దానికి కారణాలపై మనం మాట్లాడుకోవాల్సిన పనిలేదు. ఆమె వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడే హక్కు మనకి లేదు. ఆమెని వేధింపులకు గురిచేసేందుకు మీరెవ్వరు? ఆమె పూణెలో ఒంటరిగా పిల్లలను పెంచుతున్నారు. ఆమె ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో మీకు తెలుసా? ఆమె బాధలో ఉన్నప్పుడు ఎవరైనా అండగా, మద్దతుగా నిలిచారా? ఆమెకి సాయం చేయనప్పుడు ఆమె వ్యక్తిగత జీవితం విషయం మీకెందుకు? మీ హీరోని మీరు అభిమానించుకోండి.. అంతేగానీ అభిమానం పేరుతో మరొకరి వ్యక్తిగత విషయాలలో జోక్యం చేసుకునేందుకు మీరు ఎవరు? అంటూ శ్రీరెడ్డి మండిపడింది. దీనిపై పవన్‌ ఫ్యాన్స్‌ రియాక్షన్‌ ఎలా ఉంటుందో వేచిచూడాల్సివుంది..!

Sri Reddy Again Targets Pawan Kalyan Fans:

Sri Reddy attacks Pawan Kalyan fans for abusing his ex-wife Renu Desai

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ