Advertisementt

రేణు దేశాయ్ కొట్టినట్టుగా ఇచ్చింది ఆన్సర్స్‌!

Sat 30th Jun 2018 09:44 PM
renu desai,pawan kalyan,fans,counters,social media,second marriage  రేణు దేశాయ్ కొట్టినట్టుగా ఇచ్చింది ఆన్సర్స్‌!
Renu Desai Gives Strong Counter To Pawan Kalyan Fans రేణు దేశాయ్ కొట్టినట్టుగా ఇచ్చింది ఆన్సర్స్‌!
Advertisement
Ads by CJ

ప్రస్తుతం పవన్‌కళ్యాణ్‌ మాజీ భార్య రేణుదేశాయ్‌ రెండో పెళ్లి విషయం సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తూ ప్రతి విషయం వైరల్‌ అవుతోంది. ఇక ఇదే సమయం అనుకుని పలువురు పవన్‌ అభిమానులు.. తమకు ఉన్న అనుమానాలను తీర్చుకోవడానికి రేణుకి ప్రశ్నలు వేస్తున్నారు. రేణు కూడా నెటిజన్లు వేస్తున్న ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానం ఇస్తోంది. 

తాజాగా ఆమె సోషల్‌ మాద్యమంలో నెటిజన్లు అడిగిన ఆసక్తికర ప్రశ్నలకు, అంతే ఆసక్తికరంగా సమాధానం ఇచ్చింది. పవన్‌ తన పెళ్లికి వస్తాడా? అనే ప్రశ్నకు సమాధానంగా ఈ ప్రశ్నను పవన్‌నే అడగండి. ఆయన కూడా సోషల్‌మీడియాలో ఉన్నారు కదా?...పీకే మరలా కలిసి ఉందామంటే వస్తారా? అని అడిగితే ఆ ప్రశ్నను అడిగిన వ్యక్తికి భారతరత్న ఇవ్వాలని తేల్చేసింది. నా పిల్లల గురించి, నా పిల్లల భవిష్యత్తు గురించి మీరేమి బాధపడవద్దు. వాళ్లకు తల్లి, తండ్రి, పెదనాన్నలు, నాయనమ్మ, పిన్ని పెద్దమ్మ వంటి వారు ఎందరో ఉన్నారు. మీరు నా పిల్లల గురించి ఏమీ టెన్షన్‌ పడవద్దు. మీ పిల్లల గురించి ఆలోచించి, వారికి టెన్షన్‌ లేకుండా చేయండి. 

అకీరాకు నటన అంటే ఆసక్తి లేదు. నేను పెళ్లి చేసుకుంటే మీకెందుకు బాధ? నేను మీ ఇంటి అమ్మాయిని కాను. మీ ఇంటి అమ్మాయి గురించి మీరు ఆలోచించుకోవాలి. సెలబ్రిటీలు, పొలిటీషన్ల పర్సనల్‌ లైఫ్‌ గురించి మీరు మరీ ఎక్కువగా ఆలోచించవద్దు.. అంటూ కాస్త వ్యంగ్యం, మరింత క్లారిటీ ఇస్తూ రేణు అభిమానుల ప్రశ్నలకు ఓపికగా సమాధానం చెప్పి వారి అనుమానాలను నివృత్తి చేసింది. 

Renu Desai Gives Strong Counter To Pawan Kalyan Fans:

Renu Desai Counter Questions To Pawan kalyan Fans 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ