Advertisementt

నేను లేకుండా పార్టీ ఏంటి అంటోన్న రానా!!

Sat 30th Jun 2018 09:09 PM
rana daggubati,ee nagaraniki emaindi,party,tweet  నేను లేకుండా పార్టీ ఏంటి అంటోన్న రానా!!
Rana Tweet About Ee Nagaraniki Emaindi Team Party నేను లేకుండా పార్టీ ఏంటి అంటోన్న రానా!!
Advertisement
Ads by CJ

టాలీవుడ్ లో రియల్ లైఫ్ లో ప్లే బాయ్ ఎవరు అనగానే వెంటనే దగ్గుబాటి రానా ని చూపిస్తారు. ఎందుకంటే ఎప్పుడూ పార్టీలు, పబ్బులు అంటూ రానా తెగ హడావిడి చేస్తాడు. 30 ఏళ్లు దాటినా ఇంతవరకు పెళ్లి చేసుకోని భల్లాల దేవుడు టాలీవుడ్ లో ఏ యూత్ పార్టీ జరిగినా వెంటనే అక్కడ ఆ పార్టీలో జాయిన్ అవుతాడు. మెగా ఫ్యామిలీ హీరోలతో, చైతు, అఖిల్ తో రానా  పార్టీలను ఎంజాయ్ చేస్తాడు. అయితే తాజాగా రాన లేకుండా ఒక పార్టీ జరగడంతో .. కాస్త ఫన్నీగా కాస్త సీరియస్ గా రానా... నేను లేకుండా పార్టీనా? అంటూ ట్వీట్ చేశాడు.

ఇంతకీ రానా ఏ పార్టీ కోసం అంత ఇదై పోతున్నాడో తెలుసా.... అదేనండి వాళ్ళ నాన్న సురేష్ బాబు నిర్మాణంలో తరుణ్ భాస్కర్ డైరెక్టర్ గా తెరకెక్కిన 'ఈ నగరానికి ఏమైంది' సినిమా టీమ్ మొత్తం ఒక పెద్ద పార్టీ చేసుకుంది. శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా యావరేజ్ టాక్ తెచ్చుకుంది. అయితే సినిమా విడుదలై మంచి టాక్ తెచ్చుకోవడంతో... సినిమాలో నటించిన నటీనటులతో పాటుగా తరుణ్ భాస్కర్, సురేష్ బాబు లు ఒక రెస్టారెంట్ లో లంచ్ పార్టీ చేసుకున్నారు. ఇక తమ ఆనందాన్ని వారు ఒక ఫోటోతో సోషల్ మీడియా ద్వారా అందరితో పంచుకున్నారు.

మరా పార్టీలో తాను లేకపోవడంతో.. రానా అందంగా అలిగినట్టుగా... ఆ ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఆ పార్టీకి నన్ను పిలవలేదేమిటి అంటూ సరదాగా 'ఈ నగరానికి ఏమైంది' టీమ్ ని ఆటపట్టించాడు. ఇకపోతే ప్రస్తుతం రానా అన్ని భాషల్లోనూ సినిమాలు చేస్తూ బిజీగా వున్నాడు. అలాగే బిపి తో బాధపడుతున్న రానా ప్రస్తుతం ఆ ట్రీట్మెంట్ లో ఉండడమే కాదు... తర్వాత తన కన్ను ఆపరేషన్ కూడా చేయించుకోబోతున్నాడు. అది కూడా విదేశాల్లో.

Rana Tweet About Ee Nagaraniki Emaindi Team Party:

Hero Rana Daggubati Sensational Comments On Ee Nagaraniki Emaindi Team

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ