Advertisementt

ఈ శుక్రవారం విడుదలైన సినిమాలకేమైంది?

Sat 30th Jun 2018 09:00 PM
friday,ee nagaraniki emaindi,sambho sankara,sanjeevani,june 29th,tollywood  ఈ శుక్రవారం విడుదలైన సినిమాలకేమైంది?
Report on Friday Released Movies ఈ శుక్రవారం విడుదలైన సినిమాలకేమైంది?
Advertisement
Ads by CJ

నిన్న శుక్రవారం దాదాపుగా ఏడెనిమిది సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అన్ని.. లో, మీడియం బడ్జెట్ సినిమాలు, విడుదలకు సరైన డేట్ కుదరక ఒకేసారి ఈ సినిమాలన్నీ ప్రేక్షకుల మీద దండయాత్రకు దిగాయి. అయితే అన్ని సినిమాల్లో ఒకే ఒక్క సినిమాకి యావరేజ్ టాక్ వచ్చింది. అది కూడా మంచి ప్రమోషన్స్ తో పాటుగా.. ఆ దర్శకుడి ముందు సినిమా హిట్ అవడం, అలాగే పెద్ద బ్యానర్ లో ఆ సినిమా రావడంతో.. అది నిజంగానే ఆ సినిమా బతికి బట్టకట్టింది. ఆ సినిమానే ఈ 'నగరానికి ఏమైంది'. సురేష్ ప్రొడక్షన్ లో తరుణ్ భాస్కర్ డైరెక్షన్ లో నలుగురు కొత్త కుర్రాళ్లతో తెరకెక్కిన ఈ నగరానికి ఏమైంది సినిమా మిక్స్డ్ టాక్ తో థియేటర్స్ లో రన్ అవుతుంది. ఈ సినిమాలో కామెడీ కాస్త పండినా అనుకున్న ఫీల్ లేకపోవడంతోనే సినిమాకి ఆ టాక్ నడుస్తోంది. ఇక తరుణ్ భాస్కర్ తన మొదటి సినిమాని ఎంతో నేచురల్ గా తీసాడు. కానీ ఈ సినిమా కేవలం యూత్ ని టార్గెట్ చేసిన సినిమా కావడం... కామెడీ ని హైలెట్ చేస్తూ మిగతా విషయాలను నెగ్లెట్ చెయ్యడంతో సినిమా ఫలితం ఆశించినంతగా లేదు.

ఇక జబర్దస్త్ లో షకలక శంకర్ గా పేరు తెచ్చుకున్న పవన్ కళ్యాణ్ అభిమాని శంకర్ హీరోగా తెరకెక్కిన శంభో శంకర ప్లాప్ టాక్ తెచ్చుకుంది. శంకర్ అండ్ టీమ్ ఈ సినిమాకి గట్టిగా ప్రమోషన్స్ చెయ్యడం... పవన్ కళ్యాణ్ ని పొగిడినప్పటికీ.. ఈ సినిమాకి నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అయ్యింది. హీరోగా శంకర్ అస్సలు బాగోలేదని.. శంభో శంకర భయపెట్టేసిందంటున్నారు. ఇక నందు ఆనంద్ కృష్ణ హీరోగా వచ్చిన కన్నుల్లో నీ రూపమే సినిమా కూడా సో సో గా అస్సలు అలరించలేదు.  చాలా రొటీన్ గా.. బోర్ కొట్టించెయ్యడమే కాదు.. కన్నుల్లో నీ రూపమే పెద్ద సోది అంటూ కామెంట్స్ పడుతున్నాయి. 

ఇక మరో మూవీ సంజీవిని కూడా ఏమాత్రం అలరించలేక చతికిల పడింది. ఈ సినిమా.. లో బడ్జెట్ తో అదిరిపోయే గ్రాఫిక్స్ తో తెరకెక్కిన సినిమాగా ఎంతగా పబ్లిసిటి చేసినా ఆ సినిమా ప్లాప్ టాక్ తెచ్చుకుంది. ఇక మిగిలిన సినిమాలు అస్సలు ఏ థియేటర్స్ లో విడుదలయ్యాయో కూడా ఎవ్వరికి తెలియని పరిస్థితి. ఇక ఇదంతా చూస్తుంటే.. గత వారం విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సుధీర్ బాబు సమ్మోహనం మూవీకి మరో వారం మంచి కలెక్షన్స్ రావడం ఖాయం. అంటే ఈ వారం కూడా సమ్మోహనందే.

Report on Friday Released Movies:

June 29th Released Movies Box Office Report 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ