గత రెండుమూడు రోజుల నుండి పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ నిశ్చితార్ధపు విషయాలు మీడియాలో.. ఓ రేంజ్ లో హైలెట్ అయ్యాయి. పవన్ కళ్యాణ్ తో విడిపోయి ఏళ్ళు గడిచినా.. రెండో పెళ్లి విషయం ఆలోచించని రేణు దేశాయ్ ఈ ఏడాది మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకోవడమే పెద్ద హాట్ టాపిక్. తన ఇద్దరి పిల్లల్ని తన దగ్గరే ఉంచుకుని చదివిస్తూ... వారి బాగోగులు చూసుకుంటున్న రేణు దేశాయ్ లైఫ్ లో సెటిల్ అవ్వబోతోంది. అయితే రేణు దేశాయ్ దగ్గర పిల్లలున్నప్పుడు పవన్ కళ్యాణ్ తరుచు పిల్లల కోసం పూణే వెళ్లడం.... లేదంటే వాళ్లనే హైదరాబాద్ కి తెచ్చుకోవడం... చేస్తూ కొద్ది టైం పిల్లలతో స్పెండ్ చేసేవాడు. ఇక రేణు దేశాయ్ కూడా ఈ విషయంలో పవన్ కి సపోర్ట్ చేస్తూ వచ్చింది. ఇక రేణు దేశాయ్ రెండో పెళ్ళికి తన పిల్లలు అకీరా, ఆద్య ల సపోర్ట్ ఉందని చెబుతుంది.
మరి రేణు దేశాయ్ రెండో పెళ్లి చేసుకుని పిల్లల్ని కూడా చూసుకుంటానని చెబుతున్న రేణు దేశాయ్.. తన రెండో పెళ్లి విషయంలో జరిగిన రచ్చతో తన ట్విట్టర్ ఎకౌంట్ నుండి గాయబ్ అయ్యింది. అయితే ట్విట్టర్ ని క్లోజ్ చేసిన రేణు దేశాయ్ ఇంకా ఇన్స్టాగ్రామ్ ఖాతాను మాత్రం మెయింటింగ్ చేస్తుంది. అయితే ట్విట్టర్ నుండి వెళ్ళిపోయిన రేణు దేశాయ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో ఎప్పటికప్పుడు లైన్ లోనే ఉంటుంది. అయితే ట్విట్టర్ నుండి రేణు వెళ్లిపోవడంతో ఇన్స్టాగ్రామ్ లో ఉన్న రేణుతో ఒక అభిమాని నిశ్చితార్ధం చేసుకున్న మీరు పెళ్ళైన తర్వాత కూడా పవన్ తో టచ్ లో ఉంటారా అని అడిగేశాడు.
దానికి రేణు సావధానంగా.. తప్పకుండా ఉంటాను. ఎందుకంటే, అకీరా, ఆద్య ఇద్దరూ ఆయన పిల్లలు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ వారి కన్న తండ్రి. పిల్లల భవిష్యత్ కోసం ఆయనతో టచ్ లో ఉండాల్సిందే. పిల్లలకు వెకేషన్స్ వచ్చినప్పుడు లేదా ఈవెంట్స్ వచ్చినప్పుడు అకీరా అండ్ ఆద్యలు ఆయన దగ్గరకు వెళతారు అంటూ సున్నితమైన సమాధానం చెప్పింది.