12ఏళ్ల కిందట మహేష్‌బాబు, పూరీ జగన్నాథ్‌ల కాంబినేషన్‌లో వచ్చిన 'పోకిరి' చిత్రం సంచలన రికార్డులను సాధించింది. విడుదలైన అన్నిచోట్లా అద్భుతమైన కలెక్షన్లు సాధించిన ఈ చిత్రం హైదరాబాద్‌లోని సుదర్శన్ 35 ఎం.ఎం. థియేటర్‌లో 1కోటి 61లక్షల 43వేల 81 రూపాయల కలెక్షన్లు సాధించింది. అయినా ఇది పుష్కరకాలం కిందటి మాట. నాటి సినిమా థియేటర్లలో టిక్కెట్ల రేట్లకు నేడు ఉన్న థియేటర్ టిక్కెట్ల రేట్లకు నక్కకి నాగలోకానికి ఉన్నంత తేడా ఉంది.
ఇక విషయానికివస్తే ఇటీవల వేసవికానుకగా విడుదలైన మొదటి బిగ్గెస్ట్ స్టార్ చిత్రం 'రంగస్థలం'. సుకుమార్ దర్శకత్వంలో రామ్‌చరణ్, సమంత నటించిన ఈ చిత్రం ఇప్పటికే డిజిటల్ రూపంలో విడుదల అయినా కూడా థియేటర్లలో కూడా బాగానే కలెక్షన్లను వసూలు చేస్తోంది. ఈ చిత్రం విడుదలైన 89రోజులకు గాను 'పోకిరి' రికార్డులను బద్దలు కొట్టి 1కోటి 62లక్షలు వసూలు చేసింది.
దీంతో 'రంగస్థలం' చిత్రాన్ని 'పోకిరి' విడుదలైన 12 ఏళ్ల అనంతరం ఆ రికార్డులను బద్దలు కొట్టింది. ఇది రికార్డు రికార్డే అని మెగాభిమానులు అంటూ ఉంటే.. ధరల తేడా వల్ల 'పోకిరి' రికార్డును బద్దలు కొట్టనట్లు అనిపించినా 'రంగస్థలం' నిజానికి మహేష్ రికార్డును బద్దలు కొట్టినట్లు కాదని సూపర్‌స్టార్ అభిమానులు వాదిస్తున్నారు.