Advertisementt

ఛలో కి చిరు.. దీనికి బాలయ్య..!!

Sat 30th Jun 2018 09:32 AM
naga shourya,balakrishna,movie title,nari nari naduma murari  ఛలో కి చిరు.. దీనికి బాలయ్య..!!
Nari Nari Naduma Murari Title For Naga Shourya Next ఛలో కి చిరు.. దీనికి బాలయ్య..!!
Advertisement
Ads by CJ

ఈ ఏడాది స్టార్టింగ్ లో 'ఛలో' సినిమాతో బిగ్గెస్ట్ హిట్ కొట్టిన నాగ శౌర్య.. ఆ తర్వాత వచ్చిన 'కణం'..'అమ్మమ్మగారిల్లు’ రెండు సినిమాలతో నిరాశపరిచాడు. అయితే అవి ఏమి పట్టించుకోకుండా నాగశౌర్య తన పని తాను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాడు. వరసగా రెండు సినిమాలు ఓకే చేసి ఆ సినిమా పనుల్లో ఫుల్ బిజీగా ఉన్నాడు.

తన సొంత బ్యానర్ లో ఒక సినిమా... ‘భవ్య క్రియేషన్స్’ లాంటి పెద్ద సంస్థలో మరో సినిమా చేస్తున్నాడు శౌర్య. అయితే ఈ రెండు సినిమాలకి నందమూరి హీరోల పాత క్లాసిక్స్ పేర్లను శౌర్య పెట్టుకోవడం విశేషం. సొంత బ్యానర్ లో శ్రీనివాస్ అనే కొత్త దర్శకుడితో శౌర్య చేస్తున్న సినిమాకు ‘నర్తన శాల’ అనే టైటిల్ పెట్టిన సంగతి తెలిసిందే. ‘నర్తన శాల’ సినిమా సీనియర్ ఎన్టీఆర్ కెరీర్ లో ప్రత్యేకంగా నిలిచిపోయిన సినిమా. అయితే ఇప్పుడు అదే టైటిల్ ను నాగశౌర్య పెట్టుకుని మోడర్న్ ‘నర్తనశాల’లో బృహన్నల తరహా పాత్రనే చేస్తున్నట్లు సమాచారం.

అలానే భవ్య క్రియేషన్ లో రాజా కొలుసు అనే కొత్త దర్శకుడితో చేస్తున్న సినిమాకు ‘నారి నారి నడుమ మురారి’ అనే టైటిల్ పెట్టుకున్నారు. బాలయ్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచినా చిత్రం ఇది. మళ్లీ నాగశౌర్య ఆ టైటిల్ పెట్టుకుని ఇద్దరు భామల మధ్య నలిగిపోయే కుర్రాడి పాత్ర చేస్తున్నాడు. మరి ఈ నందమూరి సినిమాల పేర్లతో పలకరించబోయే శౌర్య ఎలాంటి ఫలితాన్నందుకుంటాడో చూడాలి.

Nari Nari Naduma Murari Title For Naga Shourya Next:

Naga Shourya Uses Balakrishna Movie Title 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ