Advertisementt

ఆ హీరో పక్కన హీరోయిన్ పాత్ర కావాలంట!

Fri 29th Jun 2018 09:35 PM
aditi seiya,sanju,ranbir kapoor,heroine role,rajkumar hirani  ఆ హీరో పక్కన హీరోయిన్ పాత్ర కావాలంట!
Aditi Seiya found it difficult to play Ranbir Kapoor's sister ఆ హీరో పక్కన హీరోయిన్ పాత్ర కావాలంట!
Advertisement
Ads by CJ

ఖల్‌నాయక్‌ సంజయ్‌దత్‌ జీవితం ఆధారంగా రాజ్‌కుమారి హిరాణీ దర్శకత్వంలో రూపొందుతున్న బయోపిక్‌ 'సంజు'. ఈ చిత్రం ఎన్నో అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో రిలీజ్‌ అయ్యింది. ఇక విషయానికి వస్తే ఇందులో సంజయ్‌దత్‌గా రణబీర్‌కపూర్‌ నటించాడు అనడం కంటే ట్రైలర్స్‌ చూసిన తర్వాత జీవించాడు అని చెప్పడం సమంజసం. నిజానికి రణబీర్‌కపూర్‌ సరసన హీరోయిన్‌గా నటించాలని ప్రతి హీరోయిన్‌ కలలు కంటుంది. కానీ అదే ఆయనకు సోదరి పాత్రలో నటించే అవకాశం వస్తే నటించడానికి ఎవరైనా ముందుకు వస్తారా? అనేది సందేహమే. 

ఇక 'సంజు' చిత్రంలో సంజయ్‌దత్‌ సోదరి ప్రియాదత్‌ పాత్ర అత్యంత కీలకంగా ఉంటుందని సమాచారం. ఈ పాత్రలో ఆదితి శియ నటిస్తోంది. ఈమె ఎవరో కాదు.. తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితురాలే. పూరీజగన్నాథ్‌ దర్శకత్వంలో రవితేజ నటించిన 'నేనింతే' చిత్రంలో ఆ తర్వాత 'వేదం' చిత్రంలో ఈమె శియా గౌతమ్‌గా తెలుగు వారికి సుపరిచితం. ఆ తర్వాత ఆమె తన పేరును ఆదితి శియాగా మార్చుకుంది. అలా పేరు మార్చుకున్న వేళావిశేషం ఏమిటో గానీ ఆమెకి ఏకంగా రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వంలో నటించే అవకాశం వచ్చింది. 

ఈ చిత్రం విడుదల సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాజ్‌కుమార్‌ హిరాణి గారి దర్శకత్వంలో నటించే అవకాశం వస్తే ఎవ్వరూ వదులుకోరు. రణబీర్‌కి సిస్టర్‌గా నటించినప్పటికీ నిజంగా ఆయనను సోదరుడిగా ఊహించుకోలేకపోయాను. ప్రియాదత్‌ని నేనెప్పుడు చూడలేదు. కానీ ఆమె ఇంటర్వ్యూలు వంటివి చూసి ఆమె మేనరిజమ్స్‌ నేర్చుకున్నాను, రణబీర్‌కపూర్‌ నిజంగా సింగిల్‌ టేక్‌ ఆర్టిస్టు. ఆయన పక్కన హీరోయిన్‌ పాత్ర రావాలని ఆ దేవుడిని కోరుకుంటున్నానని చెప్పుకొచ్చింది. 

Aditi Seiya found it difficult to play Ranbir Kapoor's sister:

Southern star Aditi Seiya to play Priya Dutt in the Sanjay Dutt biopic

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ