Advertisementt

కండలవీరుడికి క్లాస్ పీకారు..!!

Fri 29th Jun 2018 06:04 PM
rajkumar hirani,salman khan,sanju,sanjay dutt,biopic  కండలవీరుడికి క్లాస్ పీకారు..!!
Rajkumar Hirani responds to Salman Khan's views on Sanju కండలవీరుడికి క్లాస్ పీకారు..!!
Advertisement
Ads by CJ

ఈ శుక్రవారం దేశమొత్తం ఎంతగానో.. ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న సంజయ్‌దత్‌ బయోపిక్‌ 'సంజూ' విడుదల అయ్యింది. ఈ చిత్రానికి రాజ్‌కుమార్‌ హిరాణీ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం గురించి ఆమద్య బాలీవుడ్‌ కండలవీరుడు సల్మాన్‌ఖాన్‌ మాట్లాడుతూ, ఈ చిత్రం కోసం తాను ఎంతో ఎదురు చూస్తున్నానని, అయితే ఈ చిత్రంలో ఏదో ఒక సీన్‌లో మరీ ముఖ్యంగా క్లైమాక్స్‌లో అయినా సంజయ్‌దత్‌ని నటింపజేసి, ఆయనపై కొన్ని సీన్స్‌ని తీసి ఉండాల్సిందని అభిప్రాయపడ్డాడు. 

దీనిపై తాజాగా రణబీర్‌కపూర్‌ తీవ్రంగా స్పందించాడు. కొందరు ఏదో మనసులో పెట్టుకుని ఏవేవో మాట్లాడుతూ ఉంటారు. నాకు తెలిసి ఓ సెలబ్రిటీ బయోపిక్‌గా రూపొందించిన ఏ చిత్రంలోనూ అసలు వ్యక్తి తెరపై కనిపించిన దాఖలాలు లేవు. అలా చూపిస్తే ప్రేక్షకులు నచ్చరు.. అంటూ సల్మాన్‌ని టార్గెట్‌ చేశాడు. 

తాజాగా ఈ విషయంపై దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ కూడా స్పందించాడు. ఈ చిత్రంలో కాసేపు సంజయ్‌దత్‌ని చూపించాలనే ఆలోచన నాకు కూడా వచ్చింది. కానీ అలా చేస్తే ఇద్దరు సంజయ్‌దత్‌ల వల్ల ప్రేక్షకులు కన్‌ఫ్యూజన్‌కి లోనవుతారు. అంతేకాదు.. 'సంజు' బయోపిక్‌లో సంజయ్‌దత్తే నటిస్తే ఈ చిత్రం ఖచ్చితంగా ఫ్లాప్‌ అవుతుందని నాకు తెలుసు. కాబట్టి ఎవరో ఏదో అన్నారని వాటిని పట్టుకుని ఉండలేమని చెప్పాడు. 

ఇక ఒకప్పుడు సల్మాన్‌ మాజీ ప్రేయసి కత్రినాకైఫ్‌తో రణబీర్‌కపూర్‌ డేటింగ్ చేశాడని, అప్పటినుంచి సల్మాన్‌కి రణబీర్‌ అంటే కోపం ఉందని, ఇలా సిల్లీగా బిహేవ్‌ చేయడం, మనసులో ఏదో పెట్టుకుని ఏవేవో మాట్లాడటం సల్మాన్‌కి అలవాటే కాబట్టి వాటిని పట్టించుకోవాల్సిన అవసరం లేదని బాలీవుడ్‌ మీడియా అంటోంది.

Rajkumar Hirani responds to Salman Khan's views on Sanju:

Rajkumar Hirani responds to Salman Khan's comment that Sanjay Dutt should play himself in the biopic Sanju

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ