పవన్‌కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ రెండో వివాహం గురించి ఆమె ఎప్పటినుంచో ఇన్‌డైరెక్ట్‌గా హింట్స్ ఇస్తూనే ఉంది. కానీ పవన్ ఫ్యాన్స్ మాత్రం రేణు మరొకరిని వివాహం చేసుకోవడానికి ఒప్పుకోమని, అయినా చేసుకుంటామని ఎవరైనా ముందుకు వస్తే ముక్కలు ముక్కలుగా నరుకుతామని హెచ్చరిస్తూ ఉన్నారు. ఇక తాజాగా కూడా ఈమె తన నిశ్చితార్ధం కూడా చేసుకుని ఆ ఫొటోలను ట్విట్టర్‌లో పెట్టింది. దాంతో పవన్ వీరాభిమానుల గోల మరలా మొదలైంది.
దీంతో ఆమె ట్విట్టర్ మొత్తంగా నెగెటివిటీతో నిండినట్లు కనిపిస్తోంది. ఇక్కడ ఉన్న వారందరూ సినిమా వారిని, రాజకీయ నాయకులను విమర్శిస్తూ ఆనందపడే వారే. వీరు వృత్తిపరంగా, వ్యక్తిగతంగా అశాంతితో ఉన్నవారు. అందుకే ఈ నెగెటివిటీ నుంచి బయట పడేందుకు నేను ట్విట్టర్ నుంచి వైదొలుగుతున్నాను. ప్రతి కూలంగా వ్యాఖ్యలు చేసే వారికి దూరంగా ఉండేందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను. ఇక్కడ ఉన్న వారందరూ అజ్ఞాతవ్యక్తులే, వృత్తిపరంగా, వ్యక్తిగతంగా చిరాకుతో ఉన్నవారే. నేను నూతన జీవితంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నాను.
'నా ట్విట్టర్‌ని డీయాక్టివేట్ చేయాలని నిర్ణయించుకున్నాను. నా మంచిని కోరుతు, నన్ను అర్ధం చేసుకుని, ప్రతికూల పరిస్థితుల్లో నాకు తోడుగా, అండగా ఉన్న ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు' అంటూ చివరి ట్వీట్ చేసింది. ఇక ట్విట్టర్ నుంచి ఆమె వైదొలుగుతున్నట్లు ఓ ప్రకటనను కూడా విడుదల చేసింది. ఇప్పటికే ఈమెకి నిశ్చితార్దం జరిగింది. ఇంకా పెళ్లి తేదీ, వేదికలు నిర్ణయం కాలేదని, ఇది పెద్దలు కుదిర్చిన వివాహమేనని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది.