కొంతమంది దర్శకుడు తాము తెరకెక్కిస్తున్న సినిమాల్లో కేవలం హీరోయిజాన్ని చూపించి... హీరోయిన్స్ ని తక్కువ చేసి చూపెడతారు. మరికొంతమంది దర్శకులు హీరోయిన్స్ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తారు. మరి ప్రస్తుతం వచ్చే సినిమాల్లో హీరోయిన్స్ పాటలకు, కొన్ని సీన్స్ కి మాత్రమే పరిమితమవుతున్నారు. ఈ మధ్య కాలంలో వచ్చిన సినిమాల్లో హీరోయిన్ కి ఎక్కడా ప్రాధాన్యతనేదే కనబడింది లేదు. ప్రస్తుతం ఒకేసారి ముగ్గురు స్టార్ హీరో సినిమాల్లో నటిస్తున్న పూజ హెగ్డే పరిస్థితి ఎలా ఉందో అనేది... ప్రస్తుతం నడుస్తున్న హాట్ టాపిక్. అరవింద సమేతలో పూజ హెగ్డే పేరు తోనే సినిమా టైటిల్ ఉంది. అంటే అరవింద తో కలిసి ఎన్టీఆర్ ఈ సినిమాలో కనిపిస్తాడంటే.. ఈ సినిమాలో పూజ రోల్ బాగానే ఉంటుంది.
ఇక మహేష్ 25 వ మూవీలో పూజ రోల్ ఎలా వుండబోతుందో అనే ఆసక్తి అందరిలో ఉంది. ఇప్పటికే మహేష్ ఎంబీఏ స్టూడెంట్ గా కనబడతాడనే ప్రచారం జరుగుతున్న వేళ మహేష్ - వంశి పైడిపల్లి మూవీలో పూజ హెగ్డే ప్రాధాన్యత ఉన్న పాత్రనే చేస్తుందట. అది కూడా ఒక సాఫ్ట్ వెర్ కంపెనీలో వీడియో గేమ్ డెవలప్పర్ గా పూజ కనిపించనుందట. మరి వీడియో గేమ్స్ తయారు చేసే ఈ భామ మహేష్ తో ఎక్కడ కనెక్ట్ అయ్యి.. లవ్ లో పడుతుందో అనేది సస్పెన్స్. ఇంకా సోప్ వెర్ కంపెనీలో అమ్మడు ఎలాంటి డ్రెస్సులతో రెచ్చిపోతుందో అనేది కూడా హాట్ టాపిక్ గానే ఉంది. మరి డీజే లోను పూజ హెగ్డే గ్లామర్ పాత్రలో ప్రేక్షకులను రెచ్చగొట్టి అవకాశాలు పట్టేసింది.
ఇక అమ్మడు ఈ మూడు సినిమాలంటే ప్రభాస్ సినిమా లోను పూజానే హీరోయిన్. మరి తన గ్లామర్ తో ఇంకెలా రెచ్చిపోయి నటిస్తుందో చూడాలి. కేవలం దువ్వాడ జగన్నాధం సినిమాలో పూజ వేసిన బికినీ వలెనే ఆమెకి అవకాశాలు దండిగా వచ్చాయనేది జగమెరిగిన సత్యం. ఒక స్టార్ హీరో సినిమాలో చేస్తే.. పెరిగిన క్రేజ్ తో మరో స్టార్ హీరో సినిమాలో అవకాశం పట్టేసి టాలీవుడ్ టాప్ పొజిషన్ చేరుకోవడానికి రెడీ అయ్యింది. ఇక ప్రస్తుతం అరవింద సమేత షూటింగ్ ముగించేసిన పూజ హెగ్డే, మహేష్ కోసం డెహ్రాడూన్ వెళ్ళింది. అక్కడ వాతావరణాన్ని ఆస్వాదిస్తూ ఫోటోల మీద ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది అమ్మడు.