ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ పట్టాలెక్కకముందే... ఆదిలోనే హంస పాదు అన్నట్లుగా దర్శకుడిగా పనిచేస్తున్న క్రిష్ కి, నందమూరి బాలకృష్ణకి ఎన్టీఆర్ బయోపిక్ కి వ్యతిరేఖంగా కొందరు నోటీసులు పంపడం ఇప్పుడు ఫిలింసర్కిల్స్ లోను పొలిటికల్ గాను హాట్ టాపిక్ అయ్యింది. క్రిష్ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా, నిర్మాతగా తెరకెక్కనున్న ఎన్టీఆర్ బయోపిక్ మరికొద్ది రోజుల్లోనే సెట్స్ మీదకెళ్లబోతోంది. ఈలోపు స్క్రిప్ట్ వర్క్ పనులతో పాటుగా క్రిష్ నటీనటుల ఎంపికపై దృష్టి సారించాడు. అయితే ఇంకా ఎన్టీఆర్ బయోపిక్ ని అధికారికముగా మొదలెట్టకముందే క్రిష్, బాలకృష్ణలు నోటీసులు అందుకున్నారు. అది కూడా ఎన్టీఆర్ తో సన్నిహితంగా మెలిగి... తర్వాత తర్వాత విరోధిగా మారిన నాదెళ్ల భాస్కర్ రావు కుమారుడు ఎన్టీఆర్ బయోపిక్ లో తమ తండ్రి పాత్రని నెగటివ్ గా చూపించబోతున్నట్లుగా తెలిసి.... తమకి ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో తమని తమ కుటుంబాన్ని ఎవరూ సంప్రదించకుండా... ఎన్టీఆర్ బయోపిక్ ని తెరకెక్కిస్తున్నారని.. నాదెళ్ల భాస్కర్ రావు కుమారుడు దర్శకుడు క్రిష్ కి, బాలకృష్ణకి విడి విడిగా నోటీసులు పంపినట్లుగా తెలుస్తోంది.
మరి నాదెళ్ల భాస్కర్ రావు ఎన్టీఆర్ పార్టీ పెట్టినప్పుడు కాంగ్రెస్ నుండి తెలుగుదేశం లోకి రావడం.. ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా మెలగడం.. తర్వాత ఎన్టీఆర్ విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కాంగ్రెస్ అండదండలతో ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచి సీఎం కుర్చీని అధిరోహించడం వంటి విషయాలు అందరికి తెలిసినవే. అయితే ఎన్టీఆర్ బయోపిక్ లో నాదెళ్ల భాస్కర్ రావు ని నెగెటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో చూపిస్తారేమో అని నాదెళ్ల కుటుంబం భయపడుతుంది. అందుకే ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో క్రిష్ కి, బాలయ్యకి కోర్టు నోటీసులు పంపినది. అయితే ఎన్టీఆర్ బయోపిక్ అనే విషయం గత ఏడాది నుండి ప్రచారంలో ఉన్నప్పటికీ.. ఇప్పుడు ఈ నోటీసులు పంపడానికి గల కారణం.. దర్శకుడు క్రిష్ నాదెళ్ల భాస్కర్ రావు పాత్రకి బాలీవుడ్ నుండి సచిన్ కెడెకర్ ని ఎంపిక చెయ్యడం.. ఆయన ఎన్టీఆర్ బయోపిక్ లో నెగెటివ్ పాత్ర కోసమే తీసుకున్నట్లుగా ప్రచారం జరగడంతో... నాదెళ్ల కుటుంబం ఇలా నోటీసులు పంపింది అని టాక్.