Advertisementt

హరీష్‌.. 'దాగుడుమూతలు' ఏమైంది..?

Thu 28th Jun 2018 10:12 PM
harish shankar,kalyaan dhev,vijetha,gabbar singh director,mega hero  హరీష్‌.. 'దాగుడుమూతలు' ఏమైంది..?
Harish Shankar roped in for Chiru's son in law? హరీష్‌.. 'దాగుడుమూతలు' ఏమైంది..?
Advertisement
Ads by CJ

సినిమా రంగంలో ఒకటి తలిస్తే మరోటి జరగడం కామన్‌గా జరిగే వ్యవహారమే. ఆశపడ్డవన్ని జరగవు. చేయాలని ఆశించిన చిత్రాలన్నీ కార్యరూపం దాల్చవు. పరిస్థితులను బట్టి అన్ని మారిపోతూ ఉంటాయి. ఇక విషయానికి వస్తే మెగా కాంపౌండ్‌తో, దిల్‌రాజుతో హరీష్‌శంకర్‌కి ఎంతో సాన్నిహిత్యం ఉంది. పవన్‌కళ్యాణ్‌ వరుస ఫ్లాప్‌లలో ఉన్నప్పుడు హరీష్‌శంకరే ఆయనకు 'గబ్బర్‌సింగ్‌' వంటి బ్లాక్‌ బస్టర్‌ ఇచ్చాడు. ఆ తర్వాత ఈయన మెగామేనల్లుడు సాయిధరమ్‌తేజ్‌తో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్', స్టైలిష్‌స్టార్‌ అల్లుఅర్జున్‌తో 'దువ్వాడజగన్నాథం' చిత్రాలను చేశాడు. 'డిజె' చిత్రం ఫ్లాపని అందరు ఏకగ్రీవంగా చెప్పారు. రివ్యూలు, రేటింగ్‌లు కూడా దారణంగా వచ్చాయి. సినిమా చూసిన వారు కూడా కొత్తగా ఏమీ లేదని పెదవి విరిచారు. 

కానీ హరీష్‌శంకర్‌, అల్లుఅర్జున్‌, నిర్మాత దిల్‌రాజులు మాత్రం అది పెద్ద హిట్‌ అని తమ భుజాలు తామే తట్టుకున్నారు. అదే 'డిజె' బ్లాక్‌బస్టర్‌ అయితే మరి హరీష్‌శంకర్‌కి ఇప్పటివరకు మరో చాన్స్‌ ఎందుకు రాలేదనేది వారి విజ్ఞతకే వదిలేయాలి. ఇక ఆ తర్వాత హరీష్‌శంకర్‌ తాను తన తదుపరి చిత్రంగా ఓ కాన్సెప్ట్‌ ఓరియంటెడ్‌ చిత్రం చేస్తానని చెప్పి దానికి 'దాగుడుమూతలు' అనే టైటిల్‌ని కూడా ఫిక్స్‌ చేశాడు. ఇద్దరు హీరోలు నటించే ఈ చిత్రం షూటింగ్‌ ఎక్కువ భాగం అమెరికాలో జరుగుతుందని చెప్పి అమెరికాలో లోకేషన్ల వేట కూడా పూర్తి చేశాడు. కానీ ఆ తర్వాత దాని గురించి అప్డేట్స్‌ అయితే లేవు. ఇక 'డిజె' సమయంలో తన కోసం స్టార్‌ హీరోలు ఎందరో క్యూలో ఉన్నారని హరీష్‌ చెప్పుకొచ్చాడు. కానీ చివరకు ఆయన చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ రెండో చిత్రానికి దర్శకత్వం వహించేందుకు సిద్దమవుతున్నాడు. 

కళ్యాణ్‌దేవ్‌ నటించిన మొదటి చిత్రం 'విజేత' వచ్చే నెల 12వ తేదీన విడుదల కానుంది. దీని తర్వాత పెద్ద గ్యాప్‌ లేకుండానే కళ్యాణ్‌దేవ్‌ రెండో చిత్రం చేయాలని మెగాకాంపౌండ్‌ భావిస్తోంది. ఇప్పటికే హరీష్‌కి కూడా పిలుపు అందిందట. స్టోరీని తయారు చేసే పనిలో ఉన్న హరీష్‌ తన కథతో చిరుని మెప్పించగలిగితే కళ్యాణ్‌దేవ్‌తో రెండో చిత్రం హరీష్‌తోనే ఉంటుందని సమాచారం. 

Harish Shankar roped in for Chiru's son in law?:

Harish Shankar as a director for Kalyan Dev's upcoming movie

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ