ప్రస్తుతం నందమూరి, మెగా అభిమానులు చాలా ఆసక్తిగా ఆత్రుతతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే ఎన్టీఆర్ , రామ్ చరణ్ లు రాజమౌళి సినిమా కోసం ఎప్పుడు రెడీ అవుతారు.. అలాగే రాజమౌళి, ఎన్టీఆర్ అండ్ చరణ్ ల మల్టీస్టారర్ సినిమాని ఎప్పుడు సెట్స్ మీదకి తీసుకెళతాడు అనే ఆత్రుతతో ఉన్నారు. అయితే మీడియాలో రాజమౌళి ఈ మల్టీస్టారర్ సినిమా స్క్రిప్ట్ వర్క్ లో లేదు.. ప్రస్తుతం రామ్ చరణ్ మగధీర సినిమాతో ఇక్కడ టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్న రాజమౌళి.. ఈ సినిమాని జాపనీస్ భాషలో జపాన్ లో విడుదల చేసేందుకు ముమ్మరంగా ఏర్పాట్లు జరుగుతున్నాయనే న్యూస్ విన్నాక ఎన్టీఆర్ అండ్ చరణ్ ఫ్యాన్స్ కాస్త డీలా పడ్డారు.
అయితే ఎన్టీఆర్ మరియు చరణ్ ల మల్టీస్టారర్ ముందు నుండి ప్రచారం జరుగుతున్నట్లుగానే అక్టోబర్ నుండి పక్కాగా సెట్స్ మీదకెళుతుంది అని అంటున్నారు. ఇప్పటికే కథ మీద కూర్చున్న విజయేంద్రవర్మ కథ ఫైనల్ కాగానే రాజమౌళి పక్కగా స్క్రిప్ట్ వర్క్ తోపాటుగా ప్రీ ప్రొడక్షన్ పనులను ముగించేస్తాడట. ఈ లోపు ఎన్టీఆర్ - త్రివిక్రమ్ ల అరవింద సమేత సినిమా ఒక కొలిక్కి రావడమే కాదు.. అరవింద సమేత - వీర రాఘవని దసరా కానుకగా విడుదల చేసేందుకు గాను షూటింగ్ ని వేగంగా పరిగెత్తిస్తున్నారు ఎన్టీఆర్ అండ్ త్రివిక్రమ్ లు. ఇక ఎన్టీఆర్ అక్టోబర్ కి ఫ్రీ అవుతాడు.
ఇక రామ్ చరణ్ - బోయపాటిల మూవీ సంక్రాంతి బరిలో ఉన్నప్పటికీ.. రామ్ చరణ్ తన షూటింగ్ ని నవంబర్ కల్లా పూర్తి చేసి ఫ్రీ అవుతాడట. ఇక బోయపాటి మాత్రం ఆ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను నవంబర్ అండ్ డిసెంబర్ లలో కానిచ్చేసి సినిమాని సంక్రాంతికి తయారు చేస్తాడట. ఇక రాజమౌళి చెప్పిన టైంకి చెప్పినట్టుగా రామ్ చరణ్ కూడా పక్కాగా సెట్స్ మీదకెళ్తాడట. సో ముందునుండి అనుకున్నట్టుగానే రాజమౌళి ఈ ఎన్టీఆర్ అండ్ చరణ్ ల మల్టీస్టారర్ ని అక్టోబర్ లో మొదలు పెట్టి... నవంబర్ చివరి నుండి రెగ్యులర్ షూటింగ్ కానిచేస్తాడట. సో నందమూరి, మెగా అభిమానులు డోంట్ వర్రీ.