Advertisementt

ఎయిర్‌టెల్‌ బేబీ భలే కబుర్లు చెబుతోంది!

Wed 27th Jun 2018 04:26 PM
sasha chettri,airtel,mahesh babu,vijay devarakonda,adavi kiran  ఎయిర్‌టెల్‌ బేబీ భలే కబుర్లు చెబుతోంది!
Airtel Girl In Awe Of Mahesh, Vijay ఎయిర్‌టెల్‌ బేబీ భలే కబుర్లు చెబుతోంది!
Advertisement
Ads by CJ

ప్రముఖ మొబైల్‌ నెట్‌వర్క్‌ ఎయిర్‌టెల్‌కి ప్రచారకర్తగా ఎయిర్‌టెల్‌ బేబీ, 4జి సుందరిగా జనాలలో బాగా పాపులర్‌ అయిన యువతి షషా చెత్రి. ఈమె త్వరలో అడవి కిరణ్‌ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటించేందుకు ఒప్పుకుంది. ఈ చిత్రం కోసం తాను రూపాయి కూడా పారితోషికం తీసుకోవడం లేదని ఆమె స్పష్టం చేసింది. 

ఆమె ఇంకా మాట్లాడుతూ, నాకు తెలుగులో విజయ్‌దేవరకొండ, మహేష్‌బాబులంటే చాలా ఇష్టం. ఎయిర్‌టెల్‌ క్యాంపెన్‌ ఎక్కువ కాలం సాగడం వల్ల నాకు దేశవ్యాప్తంగా మంచి పాపులారీటీ వచ్చింది. ఏదో తెలుగు చిత్రం కదా అని చేయడం లేదు. కథ, అందులోని నా పాత్ర ఎంతో నచ్చి ఈ చిత్రంలో నటిస్తున్నాను. అడవి కిరణ్‌ గారు కథ చెప్పినప్పుడు ఎంతో థ్రిల్‌గా ఫీలయ్యాను. నేను తెలుగులోకి రావడానికి మహేష్‌ కారణం. సినిమాలు, నటన అనేవి ప్రత్యేకమైన మార్గం. వాణిజ్య ప్రకటనల తర్వాత నన్ను అందరు సినిమాల వైపు వెళ్లమని చెప్పారు. 

వాణిజ్య ప్రకటనల షూటింగ్‌ తొందరగా పూర్తవుతుంది. అదే సినిమాలైతే కాస్త సమయం పడుతుంది. ఆ సమయంలో పలు విషయాలు నేర్చుకునే అవకాశం లభిస్తుంది. బాలీవుడ్‌కి, టాలీవుడ్‌కి ఏమీ తేడా లేదు. ఎక్కడైనా కంటెంటే ముఖ్యం. ఇక అమ్మాయిలు తమని తాము ప్రేమించుకోండి. మిమ్మల్ని చూసి మీరు గర్వపడండి. ఉన్నతంగా ఆలోచించండి. మీరు మీలా ఉండండి అని చెప్పుకొచ్చింది. 

Airtel Girl In Awe Of Mahesh, Vijay:

Sasha Chettri likes Mahesh and Vijay

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ